తల్లిదండ్రులపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కొంతమంది పేరెంట్స్‌పై కోపంతో పిల్లల దారుణాలకు ఒడిగట్టారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన బావపై ఉన్న కోపంతో మేనమామ ప్రసాద్ మేనల్లుడిపై కిరాతకానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పెద్ద వాళ్ల మీద ఉన్న కోపంతో పిల్లలను చంపుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి… తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో బావ మీద ఉన్న కోపంతో మేనల్లుడిని స్వయంగా మేనమామే హత్య చేశాడు. తలుపుల మండలం గరికపల్లెలో రెండు రోజుల క్రితం నాలుగు సంవత్సరాల బాలుడు హర్షవర్ధన్ మిస్ అయ్యాడని తండ్రి గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా స్వయంగా మేనమామ ప్రసాద్. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ను చంపినట్లు తెలిసింది. బాలుడు హర్షవర్ధన్‌ను చివరిసారిగా రెండు రోజుల క్రితం బైక్‌పై పొలం దగ్గరకు తీసుకుని వెళ్లి తీసుకెళ్లడంతో పోలీసులు ప్రసాద్‌ను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.
కేవలం తన బావ మీద ఉన్న కోపంతోనే మేనల్లుడిని హత్య చేసినట్లు మేనమామ ప్రసాద్ పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ఎన్.పీ కుంట మండలం జౌకుల గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో పడేశాడు. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో పోలీసులు బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా మారింది. బావ గంగాధర్ మీద ఉన్న కోపంతో మేనల్లుడు హర్షవర్ధన్‌ను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
గతంలో తన కుమారుడు జబ్బు పడినప్పుడు బంధువులు పట్టించుకోలేదని ముఖ్యంగా బావ గంగాధర్ పట్టించుకోకపోవడంతో ప్రసాద్ ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నాడు. తాను పడిన బాధ బావ కూడా పడాలనే పగతోనే మేనల్లుడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. పెద్దలపై ఉన్న కోపాన్ని చిన్నపిల్లలపై చూపించే ఈ సైకో తరహా హత్యలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





