బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలో పైలట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువతిపై, అదే సంస్థలో కమర్షియల్ పైలట్‌గా ఉన్న 60 ఏళ్ల రోహిత్ శరణ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంలో యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థ ఉద్యోగలు పని మీద ఇద్దరూ ఇటీవల బెంగళూరుకు వెళ్లారు. అక్కడ వారికి ఏర్పాటు చేసిన హోటల్ గదిలో రోహిత్ శరణ్ ఆమెపై లైంగికి దాడికి ప్రయత్నించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పరిస్థితిని అంచనా వేసి, వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సైదులు తెలిపారు.
ప్రాథమిక విచారణ అనంతరం.. ఘటన బెంగళూరు హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో కేసును అక్కడికే బదిలీ చేసినట్లు బేగంపేట్ పోలీసులు తెలిపారు. రోహిత్ శరణ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తును హలసూరు పోలీసులు కొనసాగిస్తున్నారు
Also Read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..