Thirunageswaram Raghu Temple: మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్ కు అందని వింతలూ శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహు ఆలయం. ఈ ఆలయంలో నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో పాలు పోస్ట్.. నీలి రంగులోకి మారి.. కిందకు జారిపడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయట.. నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ప్రసిద్దిగాంచిన ఈ ఆలయం ఎక్కడ ఉందంటే.. వివరాల్లోకి వెళ్తే.

దక్షిణ భారత దేశంలో తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి కుంబకోణం లోని తిరునాగలింగేశ్వర ఆలయం. ఇక్కడ శివుడిని నాదనాదేశ్వరుడుగా పూజలను అందుకున్నాడు. ఈ ఆలయం దగ్గరగా సముద్రం ఉండటం వలన ఈ గుడి బయట అంతా సముద్రపు ఇసుక ఉంటుంది. ఇక అమ్మవారిని పేరు ‘ గిరిజకుజలాంబిక.
ఈ ఆలయంలో ప్రధానంగా పూజలను అందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో నాగరాజు రావుతో మండపంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉన్నాడు. ఈ గుడికి రాహు , నాగ దోషం ఉన్నవారు విశేష పూజలను నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే ‘ రాహుకాలం ‘ లో పాలాభిషేకం చెయ్యడం. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన తమకు ఉన్న ‘ రాహుగ్రహ ‘ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇలా రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు.
ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం. నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట.
ఆలయానికి ఎలా వెళ్లంటే:
మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి. హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16గంపడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజుపడుతుంది
Also Read
- మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ మేనేజర్‌కు ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- ఉలిక్కపడ్డ అనకాపల్లి.. నగరంలో అనుమానంగా ఇద్దరు విదేశీయుల సంచారం.. కట్‌చేస్తే..
- పాడుబడ్డ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు యువకులు.. ఏంటా అని ఆరా తీయగా..
- Hyderabad: బొల్లారం రైల్వేస్టేషన్ దగ్గర రెండు రోజులుగా ఆగిన కారు.. లోపల ఏముందా అని చూడగా
- Siddipet: పొద్దుపొడవకముందే నిద్ర లేచాడు.. టీ పెడదామని గ్యాస్ స్టౌ వెలిగించగానే..





