SGSTV NEWS online
CrimeTelangana

కంగారుగా హాస్పిటల్‌కు పరుగులు పెట్టిన మహిళ.. వీధి చివరికి వెళ్లగా



రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్లేటప్పుడు.. మన చుట్టూ ఏవేవి ఉన్నాయో అన్నది చూడటమే కాదు.. మన పక్కగా ఎవరెవరు వెళ్తున్నారు.? మన మెడలో ఉన్న చైన్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కువైపోయాయి. మద్యానికి బానిసై, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌కి బానిసై.. కొందరు యువకులు ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. వీధిలో నడిచి వెళ్లే ఒంటరి మహిళలే వీరి టార్గెట్. అదును చూసుకుని వారి మెడలో నుంచి బంగారు నగలను దోచుకెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ నగర వీధుల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. తుంకుంట ప్రధాన రహదారిపై పాత కైజన్ జిమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి సుమారు నాలుగు తులాల గోల్డ్ చైన్ అపహారించారు దుండగులు. దుండగులు ద్విచక్ర వాహనంపై మేడ్చల్ జిల్లాలో పలుచోట్లా చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Related posts