SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra Pradesh: దారుణం.. ప్రేమ పేరుతో మోసం.. మైనర్ బాలికపై అత్యాచారం..


Andhra Pradesh: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా  లేకుండా అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆడపిల్లలు బయట తిరగాలి అంటే బయపడిపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అయితే 19 ఏళ్ల శ్రీనివాస్ అనే యువకుడు.. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాను అని చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇందిరా కాలనీకి చెందిన శ్రీనివాస్ కి మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో అతను కొన్ని రోజులుగా మైనర్ బాలికతో ప్రేమగా వ్యవహరించాడు.. ఆ తర్వాత ఆమెను ఒంటరిగా కలవడానికి ప్రయత్నించేవాడు. ఇలా పరిచయం కాస్తా ఎక్కువ అవ్వడంతో బాలికను ఒంటరిగా బయటికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత బాలికకు కడుపు నొప్పి రావడంతో స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం బయట పడింది. మైనర్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా బాలిక తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తల్లి ఫిర్యాదు చేస్తూ, “మా కూతురు ప్రేమలో పడి మోసపోయింది. శ్రీనివాస్ ఆమెను మోసం చేసి, బెదిరించి అఘాయిత్యం చేశాడు” అని పోలీసులకు తెలిపింది. బాలిక కూడా విచారణలో శ్రీనివాస్పై ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ, ఇలాంటి ఘటనలు రీఫిట్ కాకూడదు అంటే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా అమ్మాయిలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి.. ఎవ్వరిని పడితే వాళ్లను నమ్మకండి.. ఇలాంటి వారి చేతిలో మోసపోకండి..

Also Read

Related posts