SGSTV NEWS online
CrimeTelangana

ఇస్త్రీ పెట్టెలో రూ.1.55 కోట్లు.. సెటప్ చూసి గుడ్లు తేలేసిన ఎయిర్‌ పోర్టు పోలీసులు… వీడియో

  • ఎయిర్‌ పోర్టులో ఇతర ప్రయాణికుల మాదిరిగానే ఓ వ్యక్తి ఎంతో డీసెంట్‌గా విమానం దిగి బయటకు వస్తున్నాడు. ఎయిర్ పోర్టు అధికారులు అతడి లగేజీని కూడా చెక్‌ చేశారు. తీరా బయటకు వచ్చాకి అధికారుల దృష్టి అతడి చేతిలోని లగేజీపై మళ్లింది. ఈసారి కాస్త శ్రద్ధగా తనిఖీ చేయడంతో అతగాడి బండారం..




హైదరాబాద్, నవంబర్‌ 17: ఎయిర్‌ పోర్టులో ఇతర ప్రయాణికుల మాదిరిగానే ఓ వ్యక్తి ఎంతో డీసెంట్‌గా విమానం దిగి బయటకు వస్తున్నాడు. ఎయిర్ పోర్టు అధికారులు అతడి లగేజీని కూడా చెక్‌ చేశారు. తీరా బయటకు వచ్చాకి అధికారుల దృష్టి అతడి చేతిలోని లగేజీపై మళ్లింది. ఈసారి కాస్త శ్రద్ధగా తనిఖీ చేయడంతో అతగాడి బండారం బయటపడింది. బట్టలు ఐరన్‌ చేసే ఇస్త్రీ పెట్టెలో ఏకంగా రూ.1.55 కోట్ల సరుకు దాచాడు. శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం రాత్రి విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పొద్దుటూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇటీవల షార్జాకు వెళ్లాడు. షార్జా నుంచి నవంబర్‌ 14న వచ్చిన సదరు వ్యాపారి తిరుగు ప్రయాణంలో తనతోపాటు 1200 గ్రాముల బరువున్న 11 బంగారం బిస్కెట్లను తీసుకొచ్చాడు. వీటిని ఎంతో పకడ్భండీగా ఇస్త్రీ పెట్టెలో అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా కవరింగ్ ఇచ్చాడు. ఇతడు ప్రయాణించిన విమానం షార్జా నుంచి శంషాబాద్‌కు వచ్చేసింది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలను కూడా చాకచక్యంగా ఎదుర్కోన్నాడు. అన్నీ తప్పించుకుని గ్రీన్‌ ఛానల్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్న సమయంలో అతడి లగేజీపై ఎయిర్‌ పోర్టు అధికారుల కన్నుపడింది.




వెంటనే అతడి లగేజీ చెక్‌ చేయగా అక్రమ బంగారం తరలిస్తున్న బంగారం గుట్టురట్టయింది. డీఆర్‌ఐ అధికారులు అతడి బ్యాగేజీలో ఉన్న ఇస్ట్రీపెట్టె (ఐరన్‌ బాక్స్‌)ను బయటకు తీశారు. దాన్ని విప్పి చూడగా మొత్తం 11 బంగారు బిస్కెట్లు లోపల కనిపించాయి. వాటి విలువ రూ.1.55 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి ఇస్త్రీ బాక్సులో తీసుకొచ్చిన 1200 గ్రాముల బంగారాన్నిఅధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడితో పాటు మరో వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దానిని ఎవరికోసం తెచ్చాడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన మరో వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Related posts