SGSTV NEWS online
Andhra PradeshViral

Viral News: వార్నీ.. వీడెవడ్రా బాబు.. ఏకంగా MRO ఆఫీస్ ని అమ్మకానికి పెట్టాడు..! కారణం ఏంటంటే..

 

సాధారణంగా OLX వెబ్‌సైట్‌ను మనం సెకండ్‌ హ్యాండ్ వాహనాలనో లేదా వాడేసిన వస్తువులను అమ్మడానికి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయాన్నే OLXలో అమ్మకానికి పెట్టాడు. MRO ఆఫీస్ అమ్మకానికి ఉందని.. దాని ధరను రూ.20వేలని పేర్కొన్నాడు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. OLXలో MRO ఆఫీస్ అమ్మడమేంటని ఆశ్చర్యపోయారు.

మనం వాడేసిన సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మడానికి, కొనడానికి సాధారణంగా ఓఎల్ఎక్స్ లాంటి యాప్‌లు ఉపయోగిస్తుంటాం.. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఒకటేమిటి రకరకాల సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను ఆన్‌లైన్లో అమ్మేస్తుంటాం.. అయితే అప్పుడప్పుడు ఆ సైట్‌లో కొన్ని వింత వస్తువులు అమ్మకానికి వస్తుంటాయి.. వాటిని ఆకతాయితనంతో పెడతారో.. లేక విసిగి వేసారి తమ ఆక్రోశాన్ని వ్యక్తపరచడానికి పెడతారో అర్ధంకాదు.. ఇలాంటి ఘటనే ప్రకాశంజిల్లాలో చోటు చేసుకుంది.

ప్రకాశంజిల్లా గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ ఓ వ్యక్తి OLXలో పోస్ట్‌ పెట్టాడు. అది కూడా కేవలం రూ. 20 వేలకే కొనుగోలు చేయవచ్చని తెలిపాడు.. వినడానికి, చూడటానికి వింతగా ఉన్నా ఇప్పుడు ఈ పోస్టింగ్‌ ఓఎల్‌ఎక్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా. అవును కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి 20 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు.

గత రెండు రోజులుగా ఈ ఫోటో ఓఎల్ఎక్స్ లో చక్కర్లు కొడుతూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్టింగ్‌పై సమాచారం అందుకున్న గిద్దలూరు రెవెన్యూ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయరెడ్డి.. తహాసీల్దార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో పనుల కోసం వచ్చి విసిగి వేసారిన ఎవరైనా ఈ పోస్టింగ్‌ పెట్టారా.. లేక ఆకతాయితనం ప్రదర్శించారా.. అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.

Also Read

Related posts