ప్రస్తుతం గురువు ఉచ్ఛలో ఉండడం, కుజ, శుక్రులు స్వస్థానాల్లో ఉండడం వల్ల హంస, రుచక, మాలవ్య మహా పురుష యోగాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల కొన్ని రాశులకు డిసెంబర్ 7వ తేదీ వరకు ‘సెలబ్రిటీ స్టేటస్’ కలుగుతోంది. విపరీత రాజయోగాలకు అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. సంపద పెరగడానికి, అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులవారు ప్రముఖుల జాబితాలో చేరడం జరుగుతుంది. ఈ రాశులకు ప్రముఖులతో పరిచయాలు, ప్రతిభా పాటవాలకు గుర్తింపు, సలహాలు, సూచనలకు విలువ, ఆకస్మిక అధికార యోగం, ధన యోగాలకు అవకాశం ఉంది.
మేషం: ఈ రాశికి అత్యంత చతుర్థ స్థానంలో ఉచ్ఛ గురువు వల్ల హంస మహా పురుష యోగం, సప్తమ స్థానంలో స్వస్థాన శుక్రుడి వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగాయి. వీటి వల్ల ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజ పూజ్యాలు కలుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. సంపద బాగా వృద్ధి చెందుతుంది.
వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నందువల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత పదవి చేపట్టడానికి అవకాశం ఉన్న కంపెనీల్లోకి మారే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక ప్రముఖుడుగా, సంపన్నుడుగా ఎదుగుతారు.
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం, చతుర్థ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగాయి. వీటి వల్ల వీరికి రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. ప్రముఖుల స్థాయికి ఎదుగుతారు.
సింహం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుజుడు స్వస్థానంలో ఉన్నందువల్ల రుచక మహా పురుష యోగం కలిగింది. దీని వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగి పోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తిపాస్తులు, సంపద చేతికి అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సామాజికంగా స్థాయి, హోదా పెరుగుతాయి.
తుల: ఈ రాశిలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం, దశమ కేంద్రంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల హంస మహా పురుష యోగం కలిగాయి. ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఆదాయం బాగా కలిసి వస్తుంది. ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ప్రముఖులతో సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్నతాధికార యోగం పడుతుంది.
మకరం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో ఉచ్ఛ గురువు స్థితి వల్ల హంస మహా పురుష యోగం, దశమ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన స్థితి వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగాయి. ఫలితంగా ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. అన్ని వైపుల నుంచి అపార ధన లాభాలు కలుగుతాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, స్థాయితో పాటు ప్రాభవం కూడా పెరుగుతుంది. ఒక వి.ఐ.పిగా గుర్తింపు పొందుతారు.
Also read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




