SGSTV NEWS online
CrimeTelangana

మాజాలో విషం కలిపి కూతురు, కొడుకుకు ఇచ్చాడు..

కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు, కూతురును గొంతు నులిమి చంపేందుకు తండ్రి మల్లేశం ప్రయత్నించాడు. అంతేకాకుండా కూల్ డ్రింక్‌లో విష పదార్థాలు కూడా కలిపినట్లు తెలుస్తోంది. దీంతో చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా… కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ… స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్చింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యం ఉండటంతోనే తండ్రి మల్లేశం ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట. అయితే ఏడు ఏళ్ల నుంచి కరీంనగలోని వావిలాల పల్లిలో ఉంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మల్లేశం కోసం పోలీసులు గాలిస్తున్నారు.



మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేటకు మల్లేశం, పోచమ్మ భార్యభర్తలు.. వీరికిమానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15) ఉన్నారు. ఈ క్రమంలోనే.. నిన్న సాయంత్రం భార్య పోచమ్మ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లింది.. దీంతో మల్లేశం మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు, కూతురుకు మజా బాటిల్ లో విషం కలిపి చంపే ప్రయత్నం చేశాడు.. తరువాత గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. మల్లేశం ఇంటినుంచి పారిపోయాడు.. ఇంట్లో తల్లి పోచమ్మ లేని సమయంలో.. ఈ దారుణానికి పాల్పడ్డాడు.

పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించి తల్లి పోచమ్మ స్థానికుల సహాయంతో ఇద్దరినీ.. ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. వీళ్ళిద్దరూ మానసిక అంగవైకల్యంతో బాధ పడుతున్నారు. దీని కారణంగానే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇద్దరు పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతుండటం.. అలాగే వీరిని పోషించడం ఇబ్బందిగా మారడంతో హత్య చేసినట్లు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Related posts