ఉత్తరాంధ్ర కల్పవల్లి అని ప్రసిద్ధి చెందిన పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కార్తీక మాస ద్వాదశి పర్వదినం, ఆదివారం ఉదయం.. సూర్యుని తొలి లేలేత కిరణాలు ఆలయం ముఖద్వారం, మండపాలు దాటి నేరుగా గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్‌ను తాకాయి.
ఉత్తరాంధ్ర కల్పవల్లి, భక్తుల కొంగు బంగారంగా కొలిచే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో వేంచేసి ఉన్న శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. గర్భగుడిలోని మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. కార్తీక మాసం, ద్వాదశి పర్వదినాన.. అమ్మవారికి, సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున ఆలయ గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్‌ను సూర్యుని లేలేత కిరణాలు తాకాయి. ఉదయం 6:20 గంటల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని తాకిన కిరణాలు సుమారు 9 నిమిషాలు పాటు విగ్రహంపై ప్రసరించాయి.
నిత్యం పసుపు వర్ణ ముఖ ఛాయతో దర్శనం ఇచ్చే దుర్గా అమ్మవారు సూర్యుని లేలేత కిరణాలు తాకటంతో దుర్గమ్మ మోము బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని కనులారా వీక్షించిన అమ్మవారి భక్తులు భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. బయట ఉండే క్యూ లైన్ కాంప్లెక్స్, ముఖద్వారం, ధ్వజస్థంభం, ముఖ మండపం, అంతరాలయం దాటి గర్భగుడిలోని అమ్మవారిని కిరణాలు తాకటం మహిమగానే భావిస్తున్నారు. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సూర్యుని కిరణాలు అమ్మవారిని తాకటం శుభపరిణామం అంటున్నారు ఆలయ అర్చకులు.
Also Read
- ఉపాధి కోసం దేశం దాటి వెళ్లింది.. వేధింపుల గురించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంది.. ఇంతలోనే..
- Andhra: ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా..
- ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు.. అద్దె భవనంలో గుట్టుచప్పుడు యవ్వారం.. కట్‌చేస్తే..
- మాజాలో విషం కలిపి కూతురు, కొడుకుకు ఇచ్చాడు..
- ఇంట్లో కదల్లేని స్థితిలో కనిపించిన కూతురు.. ఏమైందోనని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..






Tirumala: గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది.. టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న రమణదీక్షితులు