Srikakulam School teacher suspended over forcing students to massage legs: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నెర్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం సదరు టీచర్మపై సస్పెన్షన్ వేటు వేసింది..
శ్రీకాకుళం, నవంబర్ 5: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నెర్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం సదరు టీచర్మపై సస్పెన్షన్ వేటు వేసింది. నిందితురాలిని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న సుజాతగా తేల్చారు. కుర్చీలో కూర్చుని ఇద్దరు విద్యార్ధినులతో ఆమె కాళ్లు పట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ వీడియోలో సదరు ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా.. ఆమె ముందు ఇద్దరు విద్యార్థినులు నేలపై మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్లు నొక్కడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన జనాలు సదరు ప్రధానోపాధ్యాయురాలి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.
Also read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




