హైదరాబాద్ నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపింది. డ్రగ్స్ వ్యాపారానికి తెరతీసిన డాక్టర్ .. స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు.. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ STF పోలీసులు.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల LSD బోల్ట్, 1.32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్ అనే వైద్యుడు.. ఇంట్లోనే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ STF పోలీసులు .. అక్కడికి చేరుకుని.. అతని నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు తెలిపారు. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్.. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి వైద్యుడు జాన్‌పాల్ ఇంట్లో ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ విక్రయించినందుకు గాను వైద్యుడికి వీటిని ఉచితంగా ఇస్తున్నారని.. దీంతో పీజీ వైద్యుడు డ్రగ్స్‌కు బానిస అయ్యాడని తెలిపారు. అతడి ఇంట్లో ఓజీకుష్, ఎండీఎంఏ, కొకైన్, హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు
Also Read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





