ఆ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా ఉన్నాడు. అయితే అతనికి వచ్చే జీతం అతని జల్సాలకు, బెట్టింగ్‌లకు చాలకపోవడంతో తన ఇంజనీరింగ్ చదువును ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగించకుండా బైకులు చోరీ చేసేందుకు ఉపయోగించాడు.
ఆ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా ఉన్నాడు. అయితే అతనికి వచ్చే జీతం అతని జల్సాలకు, బెట్టింగ్‌లకు చాలకపోవడంతో తన ఇంజనీరింగ్ చదువును ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగించకుండా బైకులు చోరీ చేసేందుకు ఉపయోగించాడు. అయితే బైకులు చోరీ చేసిన డబ్బులు బెట్టింగ్‌లకు చాలకపోవడంతో మార్కెట్‌లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో.. ఆ మార్గాన్ని వాడుకోవాలని అనుకున్నాడు. ఒక చైన్ కొట్టేస్తే లక్షల్లో డబ్బు వస్తుందని ఆశతో బైక్ చోరీలకు కాస్తంత బ్రేక్ ఇచ్చి చైన్ స్నాచింగ్ మొదలు పెట్టాడు. అయితే చైన్స్ స్నాచింగ్ చేసిన పది రోజుల్లోనే కటకటాల పాలయ్యాడు. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందనుకున్న తల్లిదండ్రులకి కొడుకు దొంగగా మారిన విషయం తెలియడంతో కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇంజనీరింగ్ కుర్రాడు ఎవరు ఎక్కడ జరిగింది..?
నెల్లూరుకి చెందిన శ్రీనాథ్ అనే 26 ఏళ్ల యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే చదివిన చదువుకి ఉద్యోగం రాలేదనో మరే కారణమో తెలియదు కానీ ఓ చిన్న కంపెనీలో చిరుద్యోగిగా చేరాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే శ్రీనాథ్‌కి జల్సాలతో పాటు బెట్టింగ్‌లు, ఆన్లైన్ గేమింగుల పిచ్చి ఎక్కువ కావడం.. వచ్చిన కాసింత జీతం వాటికి ఏమాత్రం సరిపోకపోవడంతో తన ఇంజనీరింగ్ టాలెంట్‌ను బైక్ చోరీలపై పెట్టాడు. నిర్మానుష ప్రదేశాల్లో ఎక్కడ బైక్ కనిపించినా చోరీ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు 7 బైకులు చోరీ చేశాడు. అయితే బైక్ లు అమ్మిన డబ్బులు జల్సాలకు, బెట్టింగ్‌లకు చాలకపోవడంతో చైన్ స్నాచింగ్‌కి శ్రీకారం చుట్టాడు. గత నెల 23వ తేదీ నగరంలోని ఓ మార్గంలో సోలా లక్ష్మమ్మ అనే 67 ఏళ్ల వృద్ధురాలి మెడలో చైన్స్ స్నాచింగ్‌కి పాల్పడ్డాడు.
దీంతో బాధితురాలు నెల్లూరు చిన్న బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న చిన్న బజారు సీఐ కోటేశ్వరరావు రెండు బృందాలుగా ఏర్పడి వారం రోజులలోపే చైన్ స్నాచర్‌ని పట్టుకున్నాడు. దీంతో అసలు కథ ఏంటని పోలీసులు ఆరా తీస్తే.. ఇతను ఇంజనీరింగ్ చదువు, బెట్టింగులు, బైక్ చోరీల వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో శ్రీనాథ్‌పై కేసు నమోదు చేసి బైకులు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు చిన్న బజార్ పోలీసులు.
Also read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





