తిరుపతి జిల్లా నాగలాపురంలో ఒంటరి మహిళ దారుణహత్య కలకలం రేపింది. స్థానిక బీసీ కాలనీలో ఉంటున్న 55 ఏళ్ల మునిలక్ష్మి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారంలోపే మిస్టరీని చేదించారు. అప్పు అడగడానికి వచ్చి అంతమొందించినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాగలాపురం బీసీ కాలనీకి చెందిన 55 ఏళ్ల మునిలక్ష్మికి భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. బీసీ కాలనీలో నివాసం ఉంటూ నాగలపురంలో ఒక హోటల్ లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పుడూ తన దగ్గర ఉండే బంగారు వస్తువులు వేసుకుని ఉండే మునిలక్ష్మి ఇంటికి అక్టోబర్ 25వ తేదీన దుర్వాసులు అతని భార్య మునీశ్వరి అతిధుల్లా వచ్చారు. మునిలక్ష్మి భర్తకు అన్న కొడుకైన దుర్వాసులు భార్య మునీశ్వరితో కలిసి పిన్ని ఇంటికి వచ్చాడు. ఆరోజు అక్కడే బస చేయాలని నిర్ణయించు కున్నారు.
ఆ రాత్రి పిన్నితో మాట్లాడుతూ అప్పుగా కొంత డబ్బు కావాలని అడిగారు. రాత్రి అక్కడే బస చేసిన భార్య భర్తలు ఇద్దరూ ఇంట్లో నిద్రిస్తున్న మునిలక్ష్మిని హతమార్చాలని ప్లాన్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్ర లేచిన భార్యాభర్తలు అనుకున్న ప్రకారమే మునిలక్ష్మిని హతమార్చారు. దుర్వాసులు, అతని భార్య మునీశ్వరి.. మునిలక్ష్మి కాళ్లు పట్టుకోగా దుర్వాసులు మునిలక్ష్మి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. ఇక మునిలక్ష్మి చనిపోయినట్లు గుర్తించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
అయితే ఉదయం మునిలక్ష్మిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను అపహరించుకుని వెళ్లారని పిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మునిలక్ష్మీ హత్య జరిగిన రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటికి ఎవరు వచ్చారో ఆరా తీశారు. ఆ కోణంలోనే విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మునిలక్ష్మికి దగ్గర బంధువులైన నారాయణవనం మండలం ఉత్తరపు కండ్రిక గ్రామానికి చెందిన నీలి దుర్వాసులు అతని భార్య నీలి మునీశ్వరిపై అనుమానం వచ్చి అదుపులో తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించి అసలు నిజం బయట పెట్టారు.
తోడు ఎవరు లేని మునిలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుసుకునే నగలపై కన్నేసిన దుర్వాసులు మునీశ్వరి దంపతులు చుట్టపు చూపుగా వచ్చి మునిలక్ష్మీని హత్య చేసినట్లు తేల్చారు. ఆమె ఒంటిపై ఉన్న ఒక బంగారు చైన్, కమ్మలు, బంగారు ముక్కు పుడక తోపాటు బీరువాలో దాచి ఉంచుకున్న 2 బంగారు చైన్స్, 2 జతల కమ్మలు, ఒక జత మాటీలు, 2 ఉంగరాలు అపహరించుకుని వెళ్లినట్లు సత్యవేడు సీఐ మురళి వివరించారు. మునిలక్ష్మి హతమార్చిన దుర్వాసులు-మునీశ్వరి దంపతుల నేర చరిత్రను కూడా బయట పెట్టారు. తమిళనాడు లోని మాదర్పాకంలో 2000లో తమ ఇంటి యజమానురాలని కూడా ఇదే రీతిలో హత్య చేసి జీవిత ఖైదు అనుభవించి, 2018లో జైలు నుండి తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని మంగళంలో నివాసం ఉంటున్న దుర్వాసులు-మునీశ్వరిలను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
Also Read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





