SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra News: క్లాస్‌గా వచ్చాడు.. క్లీన్‌గా దోచుకెళ్లాడు.. కట్‌చేస్తే.. ఎలానో తెలిస్తే..



అతనికి వరుస నేరాలు చేసిన గత చరిత్ర లేదు, కేసులు , విచారణకు తిరిగిన ఘటనలు అనుభవం లేదు. కాని అతను చేసిన మొదటి దొంగతనం జరిగి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం అతను ఎక్కడ ఉన్నాడనే సమాచొరం కూడా పోలీసులకు దొరకలేదు. ఇంతకీ అతను ఎలా తప్పించుకోగలుతుగుతున్నాడు.


చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కార్యాలయానికి విజయవాడ ఆఫీస్ నుంచి మహేష్ అనే ఆడిటర్ సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చాడు. ఖాతాదారులకు చెందిన తాకట్టులోని బంగారం ప్యాకెట్లు చూపించాలని కోరాడు. వారు స్ట్రాంగ్ రూమ్ లోని 389 ప్యాకెట్లు ఆయన ముందు ఉంచారు. వాటిని ఒక్కొక్కటిగా మహేష్ తూకం వేయటం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కొబ్బరినీళ్లు కావాలని కోరటంతో మేనేజర్ బయటకు వెళ్లారు. వెంటనే గోల్డ్ ప్యాకెట్లు సర్ధేసుకున్న మహేష్ బయటకు పారిపోతుండగా క్యాషియర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాని అతను వారిని తోసుకుని  వెళ్లి పోయాడు. దీంతో సదురు బ్రాంచ్ మేనేజర్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.


దీంతో ఘటనపై కేసు నమోదు చేసినకొని రంగంలోకి దిగిన పోలీసులు.. మహేష్ ఆచూకీ కోసం జిల్లా మొత్తం నాకాబంది నిర్వహించారు.. అయినా అతను మాత్రం చిక్కలేదు. దాదాపు ఈ ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా నిందితుడు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదు.

ఇంతకు ఎవరీ మహేష్

వడ్లమూడి ఉమామేశ్వరరావు అలియాస్ మహేష్ స్వగ్రామం నెల్లూరు. ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఆడిటర్ గా 2022 నుంచి పని చేస్తున్నాడు. అయితే రెండున్నర కోట్ల విలువైన బంగారంతో పరారైన తరువాత ఇప్పటి వరకు తన సొంత కుటుంబ సభ్యులను సైతం అతను కలుసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు 2 బ్రృందాలలో గాలిస్తున్నట్టు తెలిపారు.

అయితే మహేష్ పరారీ వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పెద్ద పెద్ద సైబర్ దొంగలను సైతం పెట్టుకున్న చరిత్ర ఉన్న ఏలూరు పోలీసులకు మహేష్ మాత్రం చిక్కట్లేదు. దీంతో పోలీసులు అతనిపై రికార్డు ప్రకటించారు. మహేష్ అచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమతి అంటూ ప్రచారం చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవటంతో చింతలపూడి పోలీసుల వ్యవహారంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

Also read

Related posts