ఇంటా, బయట, పని ప్రాంతంలో.. అక్కడా, ఇక్కడ, ఎక్కడపడితే అక్కడ మహిళలు, చిన్నారులపై దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ప్రకాశంజిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై ఓ ఉన్మాది కత్తితో తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దీంతో తలపై, మెడపై మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇంటా, బయట, పని ప్రాంతంలో.. అక్కడా, ఇక్కడ, ఎక్కడపడితే అక్కడ మహిళలు, చిన్నారులపై దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ప్రకాశంజిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై ఓ ఉన్మాది కత్తితో తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దీంతో తలపై, మెడపై మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ కేకలు విని వెంటనే పరుగున వచ్చిన స్థానికులు ఉన్మాదిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
ప్రకాశంజిల్లా కనిగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో పూజ చేసుకుంటున్న మధ్య వయస్సు మహిళ సుబ్బమ్మ మెడపై, తలపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు యువకుడు. కనిగిరి పట్టణంలోని సాయిబాబా థియేటర్ దగ్గర పండ్ల వ్యాపారం చేసుకునే సుబ్బమ్మ ఇంట్లో కూర్చుని పూజ చేసుకుంటోంది. ఆ సమయంలో ఓ యువకుడు ఇంట్లో చొరబడి నా కిడ్నీలు అమ్ముతావా..? అంటూ సుబ్బమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై , తలపై నాలుగు కత్తిపోట్లు పొడిచి గాయపరిచాడు.
ఊహించని ఈ పరిణామానికి కేకలు వేస్తూ అక్కడికక్కడే కూలిపోయింది సుబ్బమ్మ. సుబ్బమ్మ కేకలు విన్న చుట్టుపక్కల స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల ప్రాధమిక విచారణలో ఉన్మాదిగా ప్రవర్తించిన యువకుడిని శివగా గుర్తించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని సుబ్బమ్మపై ఇంట్లోకి జొరబడి నా కిడ్నీలు అమ్ముతావా.. అని ప్రశ్నిస్తూ దాడి చేయడంపై పోలీసులు గతంలో శివకు సుబ్బమ్మతో ఏమన్నా గొడవలు ఉన్నాయా..? అన్న కోణంలో విచారణ చేపట్టారు. అయితే శివ మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడని, ఈ క్రమంలోనే సుబ్బమ్మపై దాడి చేశాడని అనుమానిస్తున్నారు. అయితే మతిస్థిమితం నిజంగా లేదా..? లేక కావాలనే దాడి చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..
- సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
- Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
- చిన్నారిపై లైంగిక దాడికి యత్నం





