SGSTV NEWS online
Telangana

Telangana: పాత ఇంటిని కూల్చుతుండగా కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని తెరిచి చూడగా



ఓ వ్యక్తి తన పాత ఇంటిని కూలగొట్టి.. కొత్తగా నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా జేసీబీ తెప్పించి కూలగొట్టే పనులు చేశాడు. ఇక తవ్వకాలు ప్రారంభించగా.. వారికి మట్టిలో ఏదో తగిలింది. అదేంటి అని తవ్వి చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పురాతన కాలం నాటి నాణేలు లభ్యం కావడంతో గ్రామస్తులంతా వచ్చి సిల్వర్ కాయిన్స్ అన్వేషణలో పడ్డారు. ఓ ఇంటిని నిర్మిస్తున్న ప్రాంతంలో పురాతన మట్టి పాత్ర లభించింది. ఆ పాత్రలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. మరిన్ని నాణేలు ఉండవచ్చని తవ్వకాలు చేస్తున్నారు స్థానికులు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో ఓ వ్యక్తి తన పాత ఇంటిని కూల్చి వేసి చదును చేస్తున్న క్రమంలో ఒక చిన్న గురిగిలో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం అయ్యాయి. ఇక ఈ విషయం ఊరంతా తెలియడంతో ఊరు ఊరంతా చిన్నా, పెద్ద అని తేడా లేకుండా వచ్చి వెండి నాణేలు వేటలో పడ్డారు. 15, 20 వెండి నాణాలు దొరకడంతో వాటిని తీసుకెళ్లి ఇంట్లో భద్రపరుచుకున్నారు కొంతమంది వ్యక్తులు.

ఇక ఈ తతంగం మొత్తం పోలీసులకు తెలియడంతో వెండి నాణాలు లభ్యం అయిన స్థలానికి వెళ్లి ఆరా తీశారు. వారి వద్ద నుంచి నాణేలను రికవరీ చేసి, జూలపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే ఈ నాణేలు నిజాం కాలం నాటి ఒక రూపాయిగా తెలుస్తోంది. ఇవన్నీ పాత ఇండ్లు కావడంతో అప్పటి సంపాదన బయటపడుతుంది. ఏది ఏమైనా పురాతన నాణేలు, ఇతర ప్రాచీణ వస్తువులు లభిస్తే తమకు అప్పగించాలని పోలీసులు కోరుతున్నారు

Also read

Related posts