చెత్త వెదవలు.. కామాంధులు.. మారీచులు… ఎక్కడ చూడు వీళ్లే. అమ్మాయిలకు అస్సలు రక్షణ లేకుండా పోతుంది. గుడి, బడి, వీధి, వసతి గృహం.. ఇలా ఎక్కడపడితే అక్కడ పైశాచికం ప్రదర్శిస్తున్నారు నీచులు. వికృత చేష్టలతో రెచ్చిపోతూ.. అమ్మాయిలను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు..
ఎక్కడ చూడు కామాంధులే. అమ్మాయిలకి అస్సలు రక్షణ లేదు. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయి వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి.. వికృత ఆనందం పొందే.. మారీచులు మరికొందరు. తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హిడెన్ కెమెరా కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూమ్‌లో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి.. వీడియోలు రికార్డు చేస్తున్నాడు. బాత్రూమ్‌లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంటపడింది. ఏంటా అని చెక చేయగా.. రహస్య కెమెరా అని గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్‌కి, తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. బాత్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న యాకూబ్ కోసం.. గాలింపు చేపట్టారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





