తనను పట్టించుకోలేదంటూ కూతురికి రాసిచ్చిన ఆస్తినే రద్దు చేసుకుంది ఓ వృద్ధురాలు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లి మమకారంతో ఇచ్చిన ఆస్తి… చివరికి అదే తిరిగి తల్లి పేరుకే చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి…
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను ఎంతో మమకారంతో కూతురికి ఆస్తి రాసిచ్చింది తల్లి. ఆ తతగం పూర్తయిన కొన్నాళ్ల నుంచి తల్లిని కూతురు పట్టించుకోవడం మానేసింది. దీంతో తల్లి.. తన ఆస్తిని తిరిగి ఇవ్వాలని పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళ్తే.. ధర్మవరంలోని లోనికోటకు చెందిన గుంజర లక్ష్మమ్మ అనే వృద్ధురాలు 2012లో తన కుమార్తె లక్ష్మీదేవి పేరుమీద 59 సెంట్ల స్థలాన్ని దాన విక్రయం ద్వారా రాసిచ్చింది. తల్లి ఇచ్చిన ఆస్తిని తీసుకున్న కూతురు.. ఆపై ఆమె సంరక్షణ బాధ్యతను మరిచింది. 11 ఏళ్లుగా తన సంరక్షణ పట్టించుకోవడం లేదంటూ లక్ష్మమ్మ ఆగ్రహంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో మహేష్ విచారణ జరిపించారు. విచారణలో లక్ష్మమ్మ ఆరోపణలు నిజమని తేలడంతో.. కుమార్తె లక్ష్మీదేవికి రాసిచ్చిన ఆస్తి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 59 సెంట్ల స్థలం తిరిగి తల్లి లక్ష్మమ్మ పేరుకు మార్చారు.సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం.. తల్లిదండ్రులను సంరక్షించని వారికీ బహూకరించిన ఆస్తిని తిరిగి రద్దు చేసుకునే హక్కు ఉంటుందని ఆర్డీవో స్పష్టం చేశారు. తీర్పు ప్రతిని శుక్రవారం లక్ష్మమ్మకు అందజేశారు
Also read
- Tdp Tweet: కోడి కత్తి.. కమల్ హాసన్.. టీడీపీ ర్యాగింగ్!
- కార్తీక దీపం వెలిగిస్తున్నారా? మర్చిపోకుండా ఈ ఒక్క మంత్రం చదవండి
- నేటి జాతకములు…27 అక్టోబర్, 2025
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..





