SGSTV NEWS
Andhra PradeshCrime

పెళ్లి చేస్తామంటూ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన అమ్మాయి తండ్రి.. ఇంతలోనే షాక్!



మైలవరం పట్టణానికి చెందిన చింతల వెంకటయ్య తన కుమార్తె డిగ్రీ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం సాధించి ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయవాడలో బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న తమ కుమార్తె హైదరాబాద్‌కు చెందిన యువకుడితో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

మైలవరం పట్టణానికి చెందిన చింతల వెంకటయ్య తన కుమార్తె డిగ్రీ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం సాధించి ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయవాడలో బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న తమ కుమార్తె హైదరాబాద్‌కు చెందిన యువకుడితో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించలేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు.

ఈ తెలిసి అమ్మాయి తండ్రి షాక్ అయ్యారు. అయితే మైలవరం వస్తే తానే పెళ్ళి చేస్తానని కుమార్తెని ఒప్పించారు. దీంతో ప్రేమించిన యువకుడితో మైలవరం పోలీస్ స్టేషన్ కి మాత్రమే వస్తామని ఒక కండిషన్‌తో వచ్చారు. ప్రేమ జంట, వీరి ప్రక్కనే హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నానని, యువకుడికి స్నేహితుడినని మరో వ్యక్తి కూడా వచ్చారు. ఎంతైనా కన్న తండ్రి కదా కడుపులో బాధని దిగమింగుకుంటూనే కుమార్తె మీద ప్రేమతో యువకుడి తల్లిదండ్రులను కూడా పిలిస్తే గుళ్ళో దండలు మార్చి తన కుమార్తెను అత్తారింటికి పంపుతానన్నాడు వెంకటయ్య.

అయితే ఇక్కడే కధ అడ్డం తిరిగింది. తన తల్లిదండ్రులు రారని, వారి గురించి కూడా వివరాలు తెలుపడానికి నిరాకరించాడు యువకుడు. దాంతో మీ తల్లిదండ్రులు రానిదే వివాహం కుదరదని పట్టుబట్టాడు యువతి తండ్రి. అతని తల్లిదండ్రులు లేకుండా పెళ్ళేంటమ్మా, రేపేదైనా జరిగితే ఎవరమ్మా అని తన కూతురుకి నచ్చ చెప్పబోయాడు తండ్రి. వీరి వ్యవహారం గందరగోళంగా మారడంతో ఎస్ఐ అందుబాటులో లేరు, వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు పోలీస్ స్టేషన్ సిబ్బంది‌.

ఈ లోపు ఏం తేడా కొట్టిందో భోజనం చేసి వస్తామని చెప్పి ఉడాయించబోయారు ప్రేమ జంట. ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్న అమ్మాయి తండ్రి వీరిని నీడలా వెంటాడారు. ఊర్లో హోటల్ ఉండగా ఊరు దాటి వెళుతుండడంతో కారును చేజ్ చేసి మళ్ళీ మైలవరం పోలీస్ స్టేషన్ కు ప్రేమ జంటను తరలించారు. కారును ఆపినప్పుడు జరిగిన వాగ్వాదం చూసి అటుగా వెళుతున్న వారు ఇదంతా ఆసక్తిగా గమనించారు. ఇక ఆ ప్రేమజంటను స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Also read

Related posts