SGSTV NEWS
AstrologySpiritual

రేపు ఈ రాశుల వారు శుభవార్త వింటారు.. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం..



దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు గోవర్ధన పూజ, రేపు చిత్ర గుప్తుని పూజ, అన్నాచెల్లల పండగను జరుపుకోనున్నారు. అయితే రేపు చంద్రుడి సంచారంతో అనేక రాశులకు శుభ ఫలితాలు కలుగానున్నాయని జ్యోతిష్కులు చెప్పారు. తులారాశిలో చంద్రుని సంచారం అనేక రాశులకు, ముఖ్యంగా మేషం,ధనుస్సు రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.



దేశవ్యాప్తంగా దీపాల పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజున గోవర్హన పూజని జరుపుకుంటున్నారు. రేపు (అక్టోబర్ 23న) చిత్ర గుప్త పూజ, అన్నాచెల్లల పండగను జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ప్రతిపాద తిథిలో గోవర్ధన పూజ జరుపుకుంటారు. మర్నాడు అంటే కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని రెండవ రోజున అన్నా చెల్లెళ్ల పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున చిత్ర గుప్తుడిని కూడా పూజిస్తారు.


రేపు నవ గ్రహాల్లో మనస్సుకు కేంద్ర బిందువు అయిన చంద్రుడు.. రాశిని మార్చుకోనున్నాడు. చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక రాశులకు ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్కులు చెప్పారు. ముఖ్యంగా మేష రాశి, కన్య రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.


మేషరాశి: తులారాశిలోకి చంద్రుడు సంచరించడం వల్ల మేష రాశి వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. ఇతరులకు సహాయం చేయడంలో మీరు మరింత ముందుకు వస్తారు. తల్లి పట్ల ఆప్యాయత , ప్రేమతో ఉంటారు. ఆమెకు సేవ చేస్తారు. ఆమె ఆశీర్వాదాలతో జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. డబ్బును సంపాదిస్తారు. అందుకు తగినట్లు ఖర్చు చేస్తారు. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది.



ధనుస్సు రాశి: ఈ రాశి వారికి చంద్రుడు తులారాశిలో సంచరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. అతిథులు ఇంటికి వస్తారు. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. నస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. చంద్రుని ఆశీస్సులతో, శుభకార్యాలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీకు ఇష్టమైన వారికి తెల్లటి వస్తువులను బహుమతిగా ఇవ్వండి.

ఈ సమయంలో చంద్రుడు, బుధుడు , శుక్రుడి శక్తివంతమైన అమరిక కారణంగా ఇతర రాశుల వారు కూడా ప్రయోజనాలను పొందుతారు.
ఈ సమయంలో చంద్రుడు, బుధుడు , శుక్రుడి శక్తివంతమైన అమరిక కారణంగా ఇతర రాశుల వారు కూడా ప్రయోజనాలను పొందుతారు


Related posts