SGSTV NEWS
Spiritual

Govardhan Puja: గోవర్ధన పూజ ఎప్పుడు? కన్నయ్యని ఎలా పూజించాలి తెలుసుకోండి..



దీపావళి పండగ తర్వాత గోవర్ధన్ పూజను జరుపుకుంటారు. ఈ పండగ ఐదు రోజుల పండగలో నాలుగవ రోజున జరుపుకునే పండగ గోవర్ధన పూజ. ఈ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి పట్టుకున్నాడని.. ఆ సందర్భానికి గుర్తుగా భక్తులు ప్రేమతో పండగ జరుపుకుంటారు. అన్నకూట్ ప్రసాదాన్ని కృష్ణయ్యకు సమర్పిస్తారు. ఆనందం , శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. పూజ విధానం, శుభ సమయం తెలుసుకోండి..

గోవర్ధన పూజను కన్నయ్య భక్తులు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకుంటారు. ఇది దీపావళి తర్వాత రోజున వస్తుంది. దీనిని అన్నకుట్ పూజ అని కూడా పిలుస్తారు. ఇంద్రుడి కోపం నుంచి గోవులను, బృందావనవాసులను గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తిన శ్రీకృష్ణుడి చర్యను ఈ రోజు గుర్తుచేస్తుంది. అందువల్ల ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని, శ్రీకృష్ణుడిని పూజిస్తారు.

గోవర్ధన పూజ ఎప్పుడు? ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ప్రతిపాద తిథి నాడు గోవర్ధన పూజ జరుపుకుంటారు. ఈసారి ప్రతిపాద తిథి అక్టోబర్ 21, 2025 సాయంత్రం ప్రారంభమవుతుంది. అయితే ఉదయ ప్రతిపాద తిథి అక్టోబర్ 22న కనుక గోవర్ధన పూజ 2025 అక్టోబర్ 22 బుధవారం జరుపుకుంటారు.

గోవర్ధన్ పూజ శుభ సమయం ఏడాది పొడవునా ఆనందం, శాంతి, శ్రేయస్సు , మంచి ఆరోగ్యాన్ని కోరుకునేందుకు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం గోవర్ధన పూజ ప్రారంభం: అక్టోబర్ 21 సాయంత్రం 5:54 గంటలకు ముగింపు: అక్టోబర్ 22 రాత్రి 8:16 గంటలకు పూజ నిర్వహించడానికి రెండు నిర్దిష్ట ముహూర్తాలున్నాయి. అవి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఉదయం శుభ సమయం: ఉదయం 6:26 నుంచి 8:42 వరకు సాయంత్రం ముహూర్తం: మధ్యాహ్నం 3:29 నుంచి 5:44 వరకు ఈ శుభ సమయాల్లో శ్రీకృష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి , ఆనందం నెలకొంటాయి.


గోవర్ధన కు కావాల్సిన పూజా సామాగ్రి పూజ కోసం పసుపు, కుంకుమ, అక్షతలు, స్వీట్లు, నైవేద్యం, ఖీర్, నువ్వుల నూనె దీపం, పువ్వులు, పెరుగు, తేనె, అగరబత్తి, కలశం, పూలమాల, శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రం, ఆవు పేడ, గోవర్ధన పర్వతం ఫోటో, గంగా జలం, తమలపాకు , గోవర్ధన పూజ కథకు సంబంధించిన పుస్తకం.

గోవర్ధన పూజా విధానం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ప్రాంగణంలో లేదా ప్రార్థనా స్థలంలో ఆవు పేడను ఉపయోగించి గోవర్ధన పర్వత ఆకారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తరువాత, పసుపు, అక్షతలను సమర్పించండి. దీపం వెలిగించి శ్రీకృష్ణుడికి ఖీర్, పూరీ, స్వీట్లు, పాలు, నీరు, కుంకుమ పువ్వును నైవేద్యంగా సమర్పించండి. తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గోవర్ధనుడిని ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి. చివరగా హారతి ఇచ్చి పూజలో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించమని కోరండి. గోవర్ధనుడిని పూజించడం వల్ల ఆనందం , శ్రేయస్సు లభిస్తుందని, ఇంట్లో సానుకూల శక్తి కొనసాగుతుందని , శ్రీకృష్ణుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు.

దీపావళి గోవర్ధన పూజ ఎప్పుడు? గోవర్ధన పూజ 2025 అక్టోబర్ 22 బుధవారం నాడు జరుపుకుంటారు. ఇది దీపావళి తర్వాత రోజు వస్తుంది.

దీపావళి తర్వాత గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు? ఇంద్రుడి గర్వాన్ని అణచి.. బృందావనవాసులను రక్షించిన శ్రీకృష్ణుని జ్ఞాపకార్థం ఈ పూజ నిర్వహిస్తారు.

గోవర్ధన్ ఎవరి అవతారం? గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుని రూపంగా భావిస్తారు. అందుకే దీనిని పూజిస్తారు.

గోవర్ధన పూజ ఎందుకు జరుపుకుంటారు? ప్రకృతి, ఆవులు, జంతువులు మన జీవితానికి, శ్రేయస్సుకు ఆధారం కనుక వాటి ప్రాముఖ్యతను గౌరవించడానికి గోవర్ధన్ పూజ జరుపుకుంటారు.

గోవర్ధన పూజను ఆవు పేడతో ఎందుకు జరుపుకుంటారు? ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే గోవర్ధన పర్వతం ఆవు పేడతో తయారు చేసి పూజిస్తారు. తద్వారా ప్రకృతి , గోమాత ఆశీర్వాదాలు పొందుతారు.

Related posts