వార ఫలాలు (అక్టోబర్ 19-25, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ది ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడితో సహా శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా అదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు బుధుడితో పరివర్తన చెందడం వల్ల ఆదాయ వృద్ది ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా ఒకటి రెండు చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు వల్ల పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి వీలుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి వివాదం చాలావరకు అను కూలంగా పరిష్కారమవుతుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులు, ఉచిత సహాయాలు తగ్గించుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం ఉత్తమం. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. పిల్లల కారణంగా కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
శుభ గ్రహాల సంచారం కారణంగా వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం శ్రేయస్కరం. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో విందులు, వినోదాలు, విలాసాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గురు, బుధ, శని గ్రహాల బలం వల్ల ఈ వారం కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి లాభాలు, ప్రయోజనాలను పొందు తారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేయడంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు అనుకూలంగా ఉండడంతో పాటు, లాభ స్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధి కార యోగం పట్టే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సంబంధమైన బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన పోత్సాహం, ప్రోత్సా హకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు ఢోకా ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లు, అదనపు ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. రావలసిన డబ్బును, మొండి బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెరుగుతుంది. అనుకోని ఖర్చులతో కాస్తంత ఇబ్బంది పడతారు. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. జీవిత భాగ స్వామికి తన వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ లభిస్తుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయానికి అవకాశాలు అంది వస్తాయి. ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెంచడం మంచిది. ఇతరుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు.
Also read
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
- విదేశీ అమ్మయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
- ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న.. ఉజ్మా
- మేడ్చల్ కాల్పుల ఘటన.. ఇబ్రహీం సహా ఇద్దరు అరెస్ట్