SGSTV NEWS
CrimeTelangana

Telangana: అవి అమ్మాలంటే.. లంచం ఇవ్వాల్సిందే.. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి ఆఫీసర్!



దీపావళికి ముందే నల్లగొండ ఫైర్ ఆఫీసులో అవినీతి బాంబులు పేలాయి. వరుసగా ఏసీబీకి చిక్కుతున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా 8000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నల్గొండ జిల్లాకు చెందిన ఫైర్ ఆఫీసర్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.


దీపావళికి ముందే నల్లగొండ ఫైర్ ఆఫీసులో అవినీతి బాంబులు పేలాయి. వరుసగా ఏసీబీకి చిక్కుతున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ మరో అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. దీపావళి సందర్భంగా నల్లగొండ పట్టణంలో క్రాకర్స్ షాపులు నిర్వహించుకునేందుకు వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్రాకర్స్ షాప్ అనుమతి కోసం వ్యాపారులు ఆర్డీవో, పోలీస్, ఫైర్ శాఖల నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఓ వ్యాపారి క్రాకర్ షాప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసు, రెవిన్యూ శాఖల నుండి ఎన్ఓసి తీసుకున్నాడు. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి తీసుకునేందుకు నల్గొండ ఫైర్ ఆఫీసర్ సంప్రదించాడు. కానీ క్రాకర్ షాపు అనుమతి ఇచ్చేందుకు 10వేల రూపాయల లంచం ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.


ఇక రంగంలోకి దిగిన ఏసీబీ ఆఫీసర్ అడిగిన డబ్బును తీసుకొని వెళ్లాలని వ్యాపారికి చెప్పారు. ఇందులో భాగంగానే డబ్బులు ఇచ్చేందుకు బాధితుడు ఫోన్ చేయగా.. ఫైర్ ఆఫీస్ వెనక ఉన్న కాలేజీ గ్రౌండ్ లోకి రమ్మని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ చెప్పాడు. కాలేజీ గ్రౌండ్‌లో బాధితుడు నుండి ఎనిమిది వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. బైక్ ట్యాంక్ కవర్ నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇక అనంతరం నల్గొండలోని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసులో అధికారుల తనిఖీలు చేశారు. అంతేగాకుండా సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిన్నింటిపై కూడా పూర్తి విచారణ చేసి నాంపల్లి ఎసిబి కోర్టుకు ముందు హాజరుపర్చనున్నట్లు ఏసిబి డిఎస్పి జగదీష్ చంద్ర తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారిని గొప్ప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు

Also read

Related posts