దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా లక్ష్మీ దేవి పూజలో తప్పనిసరిగా తామరపువ్వును ఉపయోగిస్తారు. తామర పువ్వుకు లక్ష్మీదేవితో ఎలాంటి సంబంధం ఉంది..? దీపావళి సందర్భంగా లక్ష్మీ దేవిని ఎలా పూజించాలి..? తామర పూలతో పూజించడంలో కొన్ని ఆసక్తికరమైన, ప్రత్యేక అంశాలను ఇక్కడ తెలుసుకుందాం..
లక్ష్మీ దేవి సముద్రం నుండి ఉద్భవించింది. నీటిలో పెరిగే అత్యంత అందమైన పువ్వులలో తామర పువ్వు ఒకటి. అందుకే ఈ పవిత్రమైన పువ్వు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. ప్రజలు దీపావళి సమయంలో దానిని ఆమెకు సమర్పిస్తారు. దీపావళి పండుగ లక్ష్మీ దేవిని ఆరాధించడానికి. లక్ష్మీని కాటాక్షం పొందేందుకు మార్గంగా భావిస్తారు. ప్రజలు ఈ రోజున తమదైన ప్రత్యేక పద్ధతుల్లో తామర పువ్వును లక్ష్మీ దేవికి సమర్పిస్తారు.
లక్ష్మీదేవికి తామర పువ్వు ఎందుకు ప్రియమైనది?
లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి ఉద్భవించిందని శాస్త్రాల ప్రకారం చెబుతారు. తామర పువ్వును నీటిలో పెరిగే అత్యంత అందమైన పువ్వుగా కూడా పరిగణిస్తారు. అందువల్ల, ఈ పువ్వు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. ముఖ్యంగా దీపావళి రోజున, లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం తామర పువ్వులను ఆమెకు సమర్పిస్తారు. లక్ష్మీ దేవికి ఖీర్తో పాటు వివిధ రకాల స్వీట్లను నైవేద్యంగా పెడతారు. కుటుంబం, వ్యాపారం, సంపదలో శ్రేయస్సును ఆశీర్వదిస్తుందని మత విశ్వాసం.
గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చెబుతారు. అందువల్ల, చాలా మంది భక్తులు పూజ సమయంలో గుడ్లగూబ ఈకలను కూడా పెడుతుంటారు. కొందరు బొమ్మలు పెడపతారు. . కుడిచేతి శంఖాన్ని లక్ష్మీ శంఖం అని కూడా పిలుస్తారు. దీనిని దేవత నివాసంగా నమ్ముతారు. పూజ సమయంలో దీనిని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎడమచేతి శంఖం విష్ణువుతో ముడిపడి ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దీపావళి పూజ సమయంలో పాత నాణేలు, బంగారం, వెండి నాణేలు, కొత్త నోట్లు, గోవురీలను పెడతారు. పురాతన కాలంలో గోవురీలు మార్పిడి మాధ్యమంగా ఉండేవి. అందువల్ల, వాటిని సంపదకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా, పూజ సమయంలో పసుపు గోవురీలను తప్పనిసరిగా భావిస్తారు.
