పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసిన ఓ హోంగార్డు ఆర్ఎంపీ వైద్యురాలి వద్దకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించడానికి యత్నించాడు. అయితే వైద్యం వికటించి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
HOME GUARD ABORT : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసిన ఓ హోంగార్డు ఆర్ఎంపీ వైద్యురాలి వద్దకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించడానికి యత్నించాడు. అయితే వైద్యం వికటించి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ముచ్చింతల్ గ్రామానికి చెందిన మధుసూదన్(39) శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఫరూక్ నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన బ్యాగరీ జయమ్మ కూతురు మౌనిక (29) ప్రైవేటు జాబ్ చేస్తుంది. గతంలో ఆమె కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అయింది.
అయితే ఈ క్రమంలో మధుసూదన్‌కు, మౌనికకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అనంతరం మౌనిక గర్భం దాల్చింది. తాను గర్భవతినని మౌనిక మధుసూదన్ కు తెలిపింది. డాక్టర్‌తో మాట్లాడానని, తప్పనిసరిగా అబార్షన్ చేసుకోవాలని మధుసూదన్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం మౌనికను మధుసూదన్ పాలమాకుల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యురాలు పద్మజ వద్దకు తీసుకెళ్లాడు. కానీ వైద్యం వికటించి యువతి ఆరోగ్యం విషమించింది. దీంతో అత్తాపూర్‌లోని జాయ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. శంషాబాద్ పోలీసులు హోంగార్డును, ఆర్ఎంపీ వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లి చేసుకుంటానని మధుసూదన్ మౌనికకు మాయమాటలు చెప్పి మోసం చేయడంతో పాటు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని డాక్టర్‌కు ఆశ చూపించినట్లు ఆరోపణలున్నాయి. కాగా తన కూతురు మృతికి కారణమైన మధుసూదన్‌తో పాటు ఆర్ఎంపీ వైద్యురాలు పద్మజపై కఠిన చర్యలు తీసుకోవాలని మౌనిక తల్లి జయమ్మ శంషాబాద్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!