జనగామ ఉప-జైలులో సింగరాజుపల్లికి చెందిన ఖైదీ మల్లయ్య బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు
జనగామ జిల్లాలో రెండు భిన్నమైన ఘటనలు జరిగాయి. ఉప-జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఖైదీ చికిత్స పొందుతూ మరణించగా, అంబులెన్స్ ఆలస్యం కారణంగా ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. జనగామ ఉప-జైలులో సింగరాజుపల్లికి చెందిన ఖైదీ మల్లయ్య బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి (MGM)కి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు.
ఖైదీ ఆత్మహత్య..
ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, సింగరాజుపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఉప-జైలు ముందు గుమిగూడి నిరసన తెలిపారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాకుండా మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లిట్ల గ్రామంలో మరో ఘటన జరిగింది. కనకలక్ష్మి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అంబులెన్స్ ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. నెల్లిట్ల వద్ద నొప్పులు ఎక్కువవ్వడంతో ఆటో డ్రైవర్ ఆశా వర్కర్లకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆశా వర్కర్లు అరుణ, పుష్ప, ఉమ ఆటోను ఆపి సురక్షితంగా ప్రసవం చేయించారు. కనకలక్ష్మి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ఆశా వర్కర్ల సకాల సహాయాన్ని అందరూ అభినందించారు.
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..