SGSTV NEWS
CrimeTelangana

Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. బాధితుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలకు రక్త శుద్ధి కోసం వెళ్లే కిడ్నీ రోగులు కొత్త రోగాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సరైన హాట్ డిసిన్ఫెక్షన్  చేయకపోవడం వల్లే హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. బాధితుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలా డయాలసిస్ ద్వారా ఇతర వ్యాధులు సోకిన బాధితులు ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. డయాలసిస్ కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ గందరగోళంగా మారింది.

కల్తీ డయాలసిస్‌తో హెచ్ఐవి ముప్పు:
డయాలసిస్ పూర్తయిన తర్వాత ప్రతి యంత్రానికి అరగంట పాటు హాట్ డిసిన్ఫెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కేంద్రాలలో రద్దీ కారణంగా సమయం లేక దీనిని సరిగా చేయడం లేదని, మరికొన్ని చోట్ల అసలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఒక రోగికి వాడిన రక్తపు ట్యూబ్‌ల నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకుతోంది. నిబంధనల ప్రకారం.. ఒక్కో డయాలసిస్‌కు ఒక సింగిల్ డయలైజర్ మాత్రమే వాడాలి. కానీ కొన్ని కేంద్రాలలో సిబ్బంది ఒకే డయలైజర్‌ను రెండు మూడుసార్లు వాడుతున్నారని.. మిగిలిన వాటిని ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.



డయాలసిస్ రోగులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్ఐవీ, హెచ్‌సీవీ వంటి వైరల్ మార్కర్ పరీక్షలు ఈఎల్ఐఎస్ఏ (ELISA) పద్ధతిలో చేయాలి. కానీ చాలా కేంద్రాలు స్ట్రిప్ పద్ధతిలో చేస్తున్నాయని, దీనివల్ల ఫలితాలలో సరైన కచ్చితత్వం ఉండటం లేదని రోగులు చెబుతున్నారు. ప్రభుత్వం డయాలసిస్ సేవలను ప్రైవేట్ సంస్థలకు పీపీపీ (PPP) పద్ధతిలో అప్పగించింది. అయితే.. మేనేజ్‌మెంట్ కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని.. కొన్ని కేంద్రాలలో సిబ్బంది డయాలసిస్ స్లాట్‌ల కోసం రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సీనియర్ అధికారులు వెంటనే తనిఖీలు చేసి సమస్యలను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts