SGSTV NEWS
CrimeNational

అయ్యో దేవుడా.. పసివాడి ప్రాణం తీసిన డ్రిల్లింగ్ మెషిన్.. అసలు ఏం జరిగిందంటే?



తిరువనంతపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఇంట్లో ప్లంబింగ్‌ పనులు జరుగుతుండగా..ప్లంబర్స్‌ టేబుల్‌పై పెట్టిన డ్రిల్లింగ్‌ మిషన్‌ను పట్టుకున్న ఒక బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడు. అనుకోకుండా డ్రిల్లింగ్‌ మిషన్ బటన్‌ నొక్కడంతో అది నేరుగా బాలుడి తలలోకి చొచ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

ఇంట్లో ప్లంబింగ్‌ పనులు జరుగుతుండగా..ప్లంబర్స్‌ టేబుల్‌పై పెట్టిన డ్రిల్లింగ్‌ మిషన్‌ను పట్టుకున్న ఒక బాలుడు ప్రమాదవశాత్తు మరణించిన ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది. అనుకోకుండా డ్రిల్లింగ్‌ మిషన్ బటన్‌ నొక్కడంతో అది నేరుగా బాలుడి తలలోకి చొచ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంలోని పదింజరే నాడకు చెందిన బాలుడి మహేష్ నివాసంలో శనివారం కొన్ని ప్లంబింగ్,విద్యుత్ పనులు జరుగుతున్నాయి.అయితే మధ్యాహ్నం లంచ్‌టైం కావడంతో ప్లంబిక్‌ వర్క్‌ చేసే కార్మికులు డ్రిల్లింగ్ యంత్రాన్ని ఇంట్లోనే ఒక టేబుల్ మీద ఉంచి భోజనానికి వెళ్లారు. అదే సమయంలో అటుగా వచ్చిన బాలుడు మహేష్.. ఆ డ్రిల్లింగ్ యంత్రాన్ని చూశాడు.దాన్ని పట్టుకోవడానికి టేబుల్ మీదకు ఎక్కాడు.

దాని కవర్ నుండి దానిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా డ్రిల్లింగ్‌ మిషన్‌తో పాటు బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బాలుడి చేయి బటన్‌కు టచ్‌ కావడంతో డ్రిల్లింగ్‌ మిషన్ ఆన్‌ అయి నేరుగా బాలుడి తలలోకి చొచ్చుకుపోయింది. మిషన్ ఆన్‌ అయిన శబ్ధం విన్న కార్మికులు, ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా హాల్‌లోకి వచ్చారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న బాలుడిని చూసి షాక్ అయ్యారు.

తీవ్రగాయాలతో పడి ఉన్న బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. కానీ కాసేపటికే బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం తర్వాత బాలుడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Also read

Related posts