సోషల్ మీడియా పరిచయాలను నమ్మి కొందరు డబ్బులు కోల్పోతుంటే, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు జైలు పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో వెలుగు చూసింది. హనీట్రాప్‌లో పడి ఒక వ్యక్తి ఏకంగా దేశ భద్రతకే ముప్పుతెచ్చే పని చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్థాన్‌కు చెందిన మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు. చివరికి రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అడ్డంగా దొరికి జైలుపాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు చెందిన గూడచార సంస్థ ఐఎస్ఐకు కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్‌ను చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంటెలిజెన్స్ అధికారులు. అయితే మంగత్ సింగ్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం పాక్‌కు చెందిన ఇషాశర్మ అనే యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన మహిళ భారత రక్షణ రహస్యాలను తెలసుకొని తనకు చెప్పాలని ఆ వ్యక్తిని కోరింది.
దీంతో మంగత్ సింగ్ భారత రక్షణ రహస్యాలను సేకరించి ఆ మహిళకు చేరవేసినట్టు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీనిపై సెంట్రల్ ఎంక్వైరీసెంటర్‌లో వివిధ నిఘాసంస్థలు విచారణ జరుపుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన మరో వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్‌గా పనిచేసే ఇతనిపై భారత్‌లో ఉంటూ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయని. అందుకే అతన్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!