టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్బుక్లో పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల విశిష్టత గురించి ఓ యువతి ఆ పోస్ట్ చేయగా.. దానిని మరో వ్యక్తి రీ-ట్వీట్ చేశాడు. ఇంతకీ అదేంటంటే మరి.?
టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై తిరుమలలో కేసు నమోదైంది. శ్రీవారి అన్నప్రసాదంపై భక్తిభావంతో ఒక యువతి ఫేస్బుక్లో పెట్టిన రీల్‌ను వక్రీకరిస్తూ టీటీడీ చైర్మన్, మేనేజ్మెంట్ను కించపరిచేలా మహమ్మద్ రఫీ అనే వ్యక్తి పోస్ట్ చేయడంపై టీటీడీ సీరియస్ అయింది. భక్తికి రాజకీయ రంగు పులుముతూ వీడియోను వైరల్ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రఫీపై టీటీడీ విజిలెన్స్ వింగ్ ఏవిఎస్వో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తిరుమల 1టౌన్ పోలీసులు వైరల్ చేస్తున్న వీడియోలో వైసీపీ నేతల ప్రసావన ఉన్నట్లు గుర్తించారు.
తిరుమల టార్గెట్‌గా దుష్ప్రచారాలు చేస్తూ, భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని గత పాలకమండలి సమావేశంలో బోర్డు తీర్మానం చేసింది. ఈ మేరకు నిరంతర నిఘాతో ఎప్పటికప్పుడు చర్యలకు టీటీడి విజిలెన్స్ వింగ్, పోలీసు శాఖ ఉపక్రమిస్తుంది.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!