SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా



మహిళ స్నానం చేస్తుండగా.. ఆమెకు ఎక్కడ నుంచో ఏదో ఫ్లాష్ కనిపించింది. ఏంటా అని పరిశీలించగా అదొక హిడెన్ కెమెరా.. దీంతో యూనివర్సిటీ అంతటా ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ఇది చిత్తూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.


చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బ్లాక్‌లో హేయమైన ఘటన బయటపడింది. గర్ల్స్ టాయిలెట్లలో హిడెన్ కెమెరా స్టూడెంట్ కంటపడటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. హిడెన్ కెమెరా వ్యవహారం యూనివర్సిటీలో కలకలం రేపింది. విషయం పేరెంట్స్ దాకా చేరడంతో చర్చగా మారింది. ఇలాంటి పనికి పాల్పడిన నీచుడు యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనులు పర్యవేక్షించే సైట్ ఇంజినీర్‌గా తేలింది. కన్స్ట్రక్షన్స్ సైట్ ఇంజనీర్ రూబెన్‌గా గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.



టాయిలెట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డింగ్‌లపై ఆరా తీశారు. ఎలాంటి వీడియో రికార్డింగ్స్ లేవని తేల్చిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తమిళనాడు రాజుపాలెం లింగాపురంకు చెందినవాడుగా గుర్తించారు. యూనివర్సిటీలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను హరినారాయణ కన్స్ట్రక్షన్‌కు అపోలో యాజమాన్యం అప్పగించగా.. సైట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కంద రూబెన్ వక్రబుద్ధి ప్రదర్శించాడు. స్టూడెంట్స్ టాయిలెట్స్‌లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు నిందితుడి వద్ద నుంచి సెల్ ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సెల్‌ఫోన్‌లో వీడియోలు డిలీట్ కావడంతో టెక్నికల్ రికవరీకి పంపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మీడియా ముందు అరెస్టు చూపే అవకాశం ఉంది

Also read

Related posts