ఆ కలప రవాణా చేయాలంటే ఎంతో మంది అధికారుల అనుమతి కావాలి. కానీ అవేవీ లేకుండానే ఆ కలప అడవి దాటిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఓ బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఖమ్మం జిల్లా అటవీ శాఖలో దోపిడీ జరిగింది. అయితే ఇదంతా ఇంటి దొంగలు పనే అని తేల్చారు ఉన్నతాధికారులు. కలప అక్రమ రవాణాలో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ రేంజ్ఆఫీసర్లు దర్యాప్తు చేపట్టారు. చింతకాని మండలం నుంచి సర్కారు తుమ్మ కలప తరలించేందుకు ముందుగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని, అనంతరం సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో నరికిన సండ్ర కలపను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు బహిర్గతమైంది. అయితే ఎలాంటి ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా, వాల్టా ఫీజు వసూలు చేయకుండా, నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ద్వారా ఆన్లైన్ లో ఎన్వోసీలను జారీ చేసినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా చింతకాని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. సండ్ర చెట్టు దుంగల అక్రమ రవాణాపై ఎంక్వైరీ చేస్తున్నామని ఖమ్మం DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.
పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని DFO తెలిపారు. చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొన్న అధికారులు, వ్యక్తులపైనా క్రిమినల్ చర్యలు ఉంటాయన్నారు. గుట్కా వంటి పాన్మసాలాల తయారీలో, పాన్లో ఉపయోగించే కత్తా తయారీలో సండ్ర కలపను వినియోగిస్తారని అధికారుల ఎంక్వైరీలో తేలింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో ఇలాంటి పరిశ్రమలు ఉండగా.. అక్కడ కలపకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ జిల్లాల్లోని విలువైన సండ్ర కలపను తరలించేందుకు ఫేక్ఎన్వోసీ రూట్ ను స్మగ్లర్లు ఎంచుకున్నట్టు అధికారులు గుర్తించారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!