ఉదయాన్నే భార్య, భర్త పత్తి చేనుకు వెళ్లారు. సాయంత్రం అయినా తిరిగి రాలేదు. కలిసి బైక్పై వెళ్ళినవారు.. రాత్రి అవుతున్నా జాడ లేదు. వారి పిల్లలు, బంధువులకు తెలియచేయడంతో.. పత్తి చేనులో వెతికితే రక్తపు మడుగులో భార్య సునీత పడి ఉంది. ఆ తర్వాత..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో భార్య సునీతను భర్త గోపి కత్తితో నరికి చంపాడు. వీరికి 17 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్త, సునీతపై అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. సోమవారం ఉదయం భార్యను బైక్పై ఎక్కించుకుని పత్తి చేనుకు వెళ్ళాడు. పొలంలో కంప నరకాలని తన వెంట కత్తి కూడా తీసుకు వెళ్ళాడు.
ఇద్దరూ భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. అయితే గోపికి తన భార్యపై అక్రమ సంబంధం ఉందనే అనుమానం కలిగి తరచూ గొడవపడేవాడు. తనతో తీసుకెళ్లిన కోటకత్తితో సునీతను నరికి హత్య చేశాడు. భార్యను కత్తితో నరికి అక్కడే పత్తి చేనులో పడేశాడు. సాయంత్రం అయినా తల్లిదండ్రులు ఇంటికి రాకపోవడంతో కుమార్తెలు బంధువులతో కలిసి చుట్టుపక్కల ఆరా తీశారు. వర్షం వచ్చిన నేపథ్యంలో పిడుగు పడి ఏమైనా జరిగిందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో సునీత మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
విషయం తెలిసిన వెంటనే జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ రవి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు గోపి పరారీలో ఉన్నాడు. అనుమానం పెను భూతం అయ్యి.. మాటల్లో దింపి పొలానికి తీసుకువెళ్ళి అతి కిరాతకంగా నరికి హత్య చేసాడు. అదే పత్తి చేనులో పడేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా.. నేడు ఉదయం భర్త గోపి కూడా పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సునీత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కుమార్తె లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!