సమాజాంతో రోజురోజుకూ కామాందులు ఎక్కువైపోతున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్దిన బయటపెడుతున్నారు. మృగాళ్లా వాళ్లపై పడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఒడిశాలో వెలుగు చూసింది. అర్థరాత్రి ఒంటరిగా కనిపించిన ఒక మహిళపై ఓ ట్రక్కు డ్రైవర్ మృగంలా ప్రవర్తించాడు.. వాడు ఏం చేశాడో తెలిస్తే రక్తం మరిగిపోతుంది.
ఒడిశాలో మానవత్వం మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రక్ జిల్లాలోని జాతీయ రహదారి-16 దగ్గర భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఓ మానసిక వికలాంగురాలిపై ట్రక్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వర్షం పడుతుండటంతో బాధితురాలు రహదారి పక్కన ఉన్న ఓ దుకాణం దగ్గర ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ట్రక్ డ్రైవర్ సద్దాం హుస్సేన్ ఆమెను బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించాడు. ఆమె ఎంత అరుస్తూ సహాయం కోరినప్పటికీ ఆ సమయంలో రహదారి నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ ఎవరూ లేరు. అయితే మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఫుటేజ్ బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. వెంటనే స్పందించిన పోలీసులు, భద్రక్ ఎస్పీ మనోజ్ రౌత్ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. టెక్నికల్ అనాలసిస్ ద్వారా అతని ట్రక్‌ను గుర్తించి, కేయోన్జర్ జిల్లా ఝుమ్పురా ప్రాంతంలో సద్దాం హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితుడు బాధితురాలిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డట్టు స్పష్టం అయింది. అత్యాచారం తర్వాత యువతిని వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలిని పోలీసుల బృందం రక్షించి, తక్షణమే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడని ఎస్పీ అరూప్ అభిషేక్ అంటున్నారు. అతనిని చట్ట పరంగా తీవ్ర శిక్ష పడేలా చూస్తామని చెబుతున్నారు
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!