హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివ కేశవులను పూజించడానికి కార్తీక మాసం చాలా పుణ్యప్రదమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాలు, పూజలు, ప్రార్థనలు శుభ ఫలితాలను ఇస్తాయని మత విశ్వాసం. ఈ నెల రోజులు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడానికి గల కారణం ఏమిటంటే..
హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం దీపావళి పండగ తర్వాత రోజు నుంచి ప్రారంభం అవుతుంది. శివ కేశవుల ఆరాధనకు విశిష్టమైన కార్తీక మాసం ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీ 2025 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల పూజలకు చాలా ముఖ్యమైనదిగా, పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో శివ కేశవులను పూజించడం వలన ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్మకం. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించే సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ఎందుకు అంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.. తులసి పూజ ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం..
కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ప్రాముఖ్యత
కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ప్రతికూలత తొలగిపోతుంది. కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు, పూర్వీకులు సంతృప్తిపడతారు. ఇంట్లో శాంతి, ఆనందం నేలకొంటుంది. కార్తీక మాసంలో ఆదివారాలు, ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు పెట్టవద్దు.. తులసి దళాలను కోయవద్దు.
కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం ఎప్పుడు వెలిగించాలి?
కార్తీక మాసంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించడం మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ఉదయం , సాయంత్రం తులసిని పూజించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించే విధానం
సమయం: కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగించాలి.
నెయ్యి లేదా నువ్వుల నూనె: దీపానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించాలి.
దిశ: ఈశాన్య దిశలో తులసి మొక్క దగ్గర మట్టి, లోహం లేదా పిండి దీపాన్ని ఉంచండి.
హారతి : దీపం వెలిగించిన తర్వాత తులసి మొక్కకు హారతి ఇవ్వండి.
జలం సమర్పించండి: కార్తీక మాసంలో ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు జలం సమర్పించండి.
నియమాలు పాటించండి: ఆదివారం, ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు లేదా నీరు సమర్పించవద్దు
స్వస్తిక్ వేయండి: కార్తీక మాసంలో తులసి కుండీ పై స్వస్తిక్ చిహ్నాన్ని వేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మంత్ర జపం: తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన తర్వాత “శుభం కరోతి కల్యాణం – ఆరోగ్యం ధన -సంపద | శత్రు – బుద్ధి – వినాశాయ దీప-జ్యోతిర- నమోస్తుతే.” అనే మంత్రాన్ని పఠించండి
