వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. ఆమెతో అతడికి పెళ్ళికి ముందు నుంచి ఉన్న పరిచయం అతడికి శాపంగా మారింది. తన భార్యతో ఒక యువకుడు సంబంధాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి.. విచక్షణ మరిచి హంతకుడిగా మారిపోయాడు. ఆ వివరాలు ఇలా..
తాడేపల్లిగూడెంకు చెందిన మాడుగుల సురేష్ సెప్టెంబర్ 23న తణుకులో అదృశ్యమయ్యాడు. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు ఇంటికి వచ్చిన అతడు అదృశ్యమవ్వడం మిస్టరీగా మారింది. సత్యనారాయణ రాజు భార్య శిరీషతో అతడికి పరిచయం ఉండటంతో ముందు సురేష్ కిడ్నాప్‌కు గురయ్యాడని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా సురేష్ నుంచి ఫోన్ రాకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే సురేష్ కుటుంబ సభ్యులు సత్యనారాయణ రాజును నిలదీశారు. ఆ తర్వాత సత్యనారాయణ రాజుతో పాటు తణుకులో కొందరు వ్యక్తులు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా సురేష్ హత్య ఘటన వెలుగు చూసింది. ఈ నెల 2న సురేష్ మృతదేహాన్ని పోలీసులు సఖినేటిపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నారు. హతుడు సురేష్ కుడిచేతిపై ఉన్న పచ్చ బొట్టు, ధరించిన దుస్తుల ఆధారంగా మృతుదేహాన్ని అతడి బంధువులు గుర్తించారు.
వివాహేతర సంభందమేనా..?
సురేష్, శిరీష తాడేపల్లికి చెందినవారు. ఈ క్రమంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తర్వాత శిరీషకు న్యాయవాది సత్యనారాయణ రాజుతో వివాహం జరిగింది. అయితే సురేష్ మాత్రం శిరీషను అప్పుడప్పుడూ రహస్యంగా కలుస్తున్నాడు. విషయం సత్యనారాయణ రాజుకు తెలియటంతో అతడు వారించే ప్రయత్నం చేసాడు. కానీ సురేష్-శిరీష మధ్య మాటలు మాత్రం ఆగలేదు. ఇంటి నుంచి క్యాంపునకు వెళుతున్నానని సత్యనారాయణ చెప్పటం, అతడు లేడనే సమాచారం తెలుసుకుని సురేష్ తణుకు రావటంతో అప్పటికే ముందస్తు ప్లాన్ చేసుకున్న సత్యనారాయణ రాజు తనకు పరిచయం ఉన్న, అప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న నలుగురితో కలిసి సురేష్‌ను బైక్‌పై బలవంతంగా తీసుకువెళ్లి సమీపంలోని స్మశానంలో కొట్టడంతో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. సురేష్‌ను ముందుగా అక్కడే ఎవరికి తెలియకుండా దాచిపెట్టి.. ఆపై చీకటిపడ్డ తర్వాత సత్యనారాయణ రాజు తన సోదరుడి కారులో మృతదేహాన్ని ఎవరి కంటా పడకుండా చించినాడ తీసుకుని వెళ్లి అక్కడ గోదావరిలో పడేసినట్లు పోలీసులు నిర్థారించారు.
ఇక హత్య తర్వాత సురేష్ వినియోగించే
మొబైల్‌ను తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్లి పడేయటంతో పాటు శవాన్ని తరలించే సమయంలో కారు నెంబర్ ప్లేట్‌ను సైతం నిందితులు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసులో న్యాయవాది సత్యనారాయణ రాజు, అతని భార్య శిరీషతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!