మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోనూ మీరట్ తరహా ఘటన చోటుచేసుకుంది. డ్రమ్ములో కాళ్లు చేతులు కట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోనూ మీరట్ తరహా ఘటన చోటుచేసుకుంది. డ్రమ్ములో కాళ్లు చేతులు కట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలిని దేవాస్ జిల్లాకు చెందిన లక్షిత చౌదరి(22)గా గుర్తించారు. మనోజ్ చౌహాన్ అలియాస్ మోనుతో లక్షిత ప్రేమలో ఉంది. అయితే లక్షిత మరో వ్యక్తితో లక్షిత మాట్లాడుతుందన్న అనుమానంతో ఆమెను హత్య(murder) చేశాడు మనోజ్. వైశాలి అవెన్యూ కాలనీలో ఈ ఘటన జరిగింది.
లక్షిత కుటుంబం ప్రకారం, ఆమె మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. లక్షిత సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది, కానీ తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆ కుటుంబం పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. హత్య చేసిన అనంతరం నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు మనోజ్. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నీలిరంగు డ్రమ్ లో ఉన్న లక్షిత డెడ్ బాడీ(Dead Body) ని స్వాధీనం చేసుకున్నారు. లక్షితను తాను ప్రేమిస్తున్నానని, కానీ ఆమె వేరొకరితో సంబంధంలో ఉందని తెలుసుకున్న కోపంతో ఆమెను చంపేశానని మనోజ్ పోలీసులకు చెప్పాడు.
చేతులు, కాళ్ళు కట్టేసి
ముందుగా లక్షితను తన ఇంటికి పిలిపించి, ఆమె చేతులు, కాళ్ళు కట్టేసి, నీళ్ళు నింపిన డ్రమ్ములో ముంచి చంపేశాడు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇండోర్‌కు పంపామని, నిందితుడిని విచారిస్తున్నామని దేవాస్ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి ఘటనలే ఈ ఏడాది దేశంలో చోటుచేసుకున్నాయి. మీరట్‌లో ఒక వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు కలిసి హత్య చేశారు. అనంతరం ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో తడి సిమెంట్ కింద పాతిపెట్టారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో కూడా, ఒక వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు కలిసి హత్య చేశారు. అద్దెకు తీసుకున్న ఇంటి మొదటి అంతస్తులో అతని మృతదేహం దొరికింది. అతని ఇంటి యజమాని అయిన వృద్ధ మహిళ డ్రమ్ నుండి దుర్వాసన వస్తున్నట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..