మహబూబాబాద్ జిల్లాలో ఘోర హత్య సంచలనం రేపింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో భార్యాభర్తల మధ్య పండుగ రోజున జరిగిన గొడవ చివరకు దారుణానికి దారితీసింది. చీకటి నరేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నను ఇంట్లోనే కుటుంబ సభ్యుల కళ్ల ముందే గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి పెద్ద కుమారుడిపై తల్లి చూపుతున్న అతిగారాబమే తరచూ గొడవలకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.
పండుగ రోజు భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ చివరకు భార్య హత్యకు దారి తీసింది. కసాయి మనసుతో భర్త భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, ముఖ్యంగా తల్లి అతిగా చూపిన మమకారం వల్ల పెద్ద కొడుకు చెడుదారులు పడుతున్నాడని పోలీసులు గుర్తించారు.
ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో జరిగింది. ఆలేరు గ్రామానికి చెందిన చీకటి నరేష్–స్వప్న దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరాణా షాప్, చికెన్ సెంటర్ నడుపుతూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో కొంతకాలంగా కలహాలు పెరుగుతున్నాయి. పెద్ద కొడుకు దారి తప్పడం భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమైంది.
భార్యపై అనుమానం, అసహనం పెంచుకున్న నరేష్ సైకోలా ప్రవర్తించాడు. ఇంట్లో ఉన్న కొడుకు, కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, ఎలాంటి కనికరం లేకుండా తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు స్వప్న పెద్ద కుమారుడు విక్రమ్ పట్ల అతి గారాబం చూపించడంతో తండ్రి మాట వినకపోవడం, భార్య పెత్తనం పెరగడం వంటివి నరేష్లో అసహనాన్ని పెంచాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మళ్లీ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో నరేష్ గొడ్డలితో భార్యపై దాడి చేసి, మెడపై నరికడంతో స్వప్న అక్కడికక్కడే మృతి చెందిందని నెల్లికుదురు CI సత్యనారాయణ తెలిపారు.
ప్రాథమిక విచారణలో భార్యాభర్తల కలహాలే హత్యకు కారణమని తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ భారం తన భుజాలపై మోస్తూ నడిపిస్తున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఆ ఉన్మాదిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!