జానపద ఇండస్ట్రీలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ రాజూ సెల్ఫీ వీడియో తీసుకుని తుదిశ్వాస విడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జానపద ఇండస్ట్రీలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ రాజూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవలే అతని అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కాగా రాజూ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటకు చెందిన రాజు జానపద పాట వీడియోలు చేస్తుండేవాడు. అయితే ఆరు నెలల క్రితమే రాజూ ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను జీవితం అనుకున్నట్టు సాగలేదు. పెళ్లైన ఆరు నెలలకే అతను పెద్ద బతుకమ్మ పండక్కి భార్య కోసం కొన్న చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు.
రాజూ సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. అమ్మా, బాపు.. బతకలేకపోతున్నా.. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నాకు టార్చర్ అనిపిస్తోంది. నా భార్య మిమ్మల్ని ఊరికె తిడ్తది. నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లయిపోయింది. అన్నా, వదినా.. పిల్లలు జాగ్రత్త. సౌందర్య ఇక నువ్వు మంచిగ బతుకు. నీలాంటి ఆమెకు మొగోళ్లు సెట్ అవ్వరు. నువ్వ అన్న మాటలకు నాకు మెంటల్ టార్చర్ అయితుంది. నాకు ఈ బతుకు బతకబుద్ధవట్లేదు. నాకు బట్టలు తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా.. భార్య కోసం కొత్త చీర కొన్నా.. అమ్మా, బాపు బై జాగ్రత్త అని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!