జాతకంలో శని దోషంతో బాధపడుతున్నవారికి దోష నివారణకు దసరా ఒక గొప్ప అవకాశం. విజయదశమి రోజున కొన్ని పరిహారాలను చేయడం వలన శని దోషాన్ని సులభంగా తొలగించుకోవచ్చు. కనుక దసరా రోజున శని దోషం నుంచి బయటపడటానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.
దసరా పండగను విజయదశమి అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన.. ప్రధాన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దసరా పండగను దేశంలో ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా జరుపుకుంటారు. అయితే ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉన్నా.. ఎవరైనా శని సంబంధిత బాధలతో ఇబ్బంది పడుతున్నా వాటి నుంచి బయట పడేందుకు దసరా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజున ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
దసరా నాడు శని దోష నివారణ పరిహారాలు జాతకంలో శని దోషం ఉన్నవారు దసరా రోజున జమ్మి చెట్టుని పూజించాలి. అంతేకాదు దసరా రోజున ఇంటికి ఈశాన్య దిశలో జమ్మి చెట్టుని నాటాలి. ఇది జాతకంలోని శని దోషాన్ని తొలగిస్తుందని చెబుతారు.
శనీశ్వరుడు, హనుమంతుని ఆరాధన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుని భక్తులు ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించాలి. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావాల నుంచి హనుమంతుడు తన భక్తులను రక్షిస్తాడు. ఎవరైనా జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. దాని నుంచి ఉపశమనం పొందడానికి దసరా రోజున శనీశ్వరుడిని, హనుమంతుడిని పూజించడం చాలా ఫలవంతం.
నువ్వుల నూనె దీపం జాతకంలో శని సంబంధిత దోషం ఉన్నవారు.. లేదా ఏలినాటి శని లేదా శని ధైయ్యతో బాధపడుతున్నవారు.. దసరా రోజున నువ్వుల నూనె దీపం వెలిగిస్తే.. ఆ దోషాల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతారు. ఈ పరిహారం శని సంబంధిత కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్మకం.
కొబ్బరి కాయతో పరిహారం హిందూ మతంలో కొబ్బరికాయలను చాలా పవిత్రంగా భావిస్తారు. దసరా రోజున కొబ్బరికాయను తీసుకొని దానిని మీ తల చుట్టూ 21 సార్లు తిప్పుకుని ఆపై దానిని నేలమీద కొబ్బరి కాయ పగిలేలా కొట్టాలి. ఈ పరిహారం శనీశ్వర ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. సుఖం, శ్రేయస్సును తెస్తుందని చెబుతారు.
రామచరిత మానస్ పఠనం జాతకంలో ఉన్న శని దోషాన్ని తొలగించి.. సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడటానికి.. దసరా రోజున ఇంట్లో సుందరకాండ , రామ చరిత మానస్‌లను పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది
