స్వామి చైతన్యానంద సరస్వతి అనే మోసపూరిత దేవుడి నిజస్వరూపం బయటపడింది. కాషాయ దుస్తులు ధరించిన ఈ వ్యక్తి తన విద్యా సంస్థ ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Fake Baba: స్వామి చైతన్యానంద సరస్వతి అనే మోసపూరిత దేవుడి నిజస్వరూపం బయటపడింది. కాషాయ దుస్తులు ధరించిన ఈ వ్యక్తి తన విద్యా సంస్థ ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు కన్నెపిల్లలతో రహస్యగుహలో రాసలీలు చేస్తున్నట్లు బయటపడింది. ముగ్గురు అక్కాచెల్లెలు.. రష్మి, కాజల్, శ్వేతల వాంగ్మూల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు నకిలీ దేవుడి ఆశ్రమం వెనుక ఉన్న చీకటి సత్యాలన్నీ బయటపడగా.. అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నాయి.
రాత్రివేళలో రాక్షస క్రీడ:
బాబా మొబైల్ ఫోన్‌లో రాత్రిపూట తీసిన అనేక నేరారోపణ ఫోటోలను పోలీసులు కనుగొన్నారు. వాటిలో అర్ధరాత్రి బాబా విలాసవంతమైన గదికి పిలిపించబడిన ఒక యువతి ఫోటో కూడా ఉంది. విలాసవంతమైన మంచం, టీవీ, బాల్కనీతో కూడిన ఆ గది 5 స్టార్ హోటల్ కంటే తక్కువేమీ కాదని, బాబా బాధితులకు ఫోన్ చేసి ఇక్కడకు రప్పించుకుని అనుతిగంగా ప్రవర్తి్స్తాడని పోలీసులు తెలిపారు. కన్నేపిల్లలపై ఇదే రహస్య గదిలో బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. అనేక మంది అమ్మాయిలను అల్మోరా, ఇతర ప్రాంతాలకు పంపినట్లు గుర్తించారు. ఒకసారి ఒక యువతిని హనీట్రాప్‌లో పడేయడానికి మరోక వ్యక్తితో ఆమె సన్నిహిత ఫోటోలను పంపమని అడిగాడని, దీని కోసం ఆమెకు డబ్బు కూడా ఇచ్చాడని చెప్పారు.
ఫోన్‌లో ప్రత్యేక యాప్:
‘బాబా లండన్‌లో ఒక వాట్సాప్ నంబర్‌ను ఉపయోగించాడు. ఈ నంబర్ ద్వారా అతను నిరంతరం మహిళలను సంప్రదిస్తూ ఉండేవాడు. డిలిట్ చేసిన చాట్ రికవరీ చేసిన తర్వాత షాకింగ్ సందేశాలు బయటపడ్డాయి. వాటిలో ఒక అమ్మాయికి ‘బేబీ.. ఐ లవ్ యు’ వంటి సందేశాలను పంపినట్లు ఉంది. కొన్ని నంబర్లను పోలీసులు బ్లాక్ చేసిన తర్వాత కూడా అతను కొత్త నంబర్‌లను ఉపయోగించి మహిళలను సంప్రదించడం కొనసాగించాడు. అతని ఫోన్‌లో HIK విజన్ యాప్ ఉంది. ఆశ్రమంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు అతని ఫోన్‌కు కనెక్ట్ చేయబడ్డాయి. అతను ప్రతి మూలన నిఘా ఉంచాడు. ఈ నిఘా నెట్‌వర్క్ బాధితులను ఎంపిక చేసుకునే వ్యూహంలో భాగం. కాగా అవకాశం వచ్చినప్పుడు అమ్మాయిలను తన గదికి ఆహ్వానించేవాడు’ అని వెల్లడించారు.
విలాసవంతమైన గుహ:
నకిలీ బాబా ప్రైవేట్ గది ఒక విలాసవంతమైన హోటల్‌ను పోలి ఉంది. మెత్తటి ఫర్నిచర్, పెద్ద మంచం, ఓపెన్ బాల్కనీతో.. ఇలా యువతులను ఆకర్షించడానికి రూపొందించాడు. ఈ గది అతని కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. అక్కడ అతను తన బాధితులను ఆకర్షించి అసభ్యకరమైన చర్యలకు పాల్పడేవాడు. యువతులను ఆకర్షించడానికి ఖరీదైన నగలు, గడియారాలు వంటివి బహుమతులు ఇచ్చాడు. అతను అనేక మంది మహిళల నుండి రెజ్యూమ్‌లను సేకరించి, తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేవాడని దర్యాప్తులో తేలింది
బాత్రూమ్‌లలో కెమెరాలు:
దర్యాప్తులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. చైతన్యానంద సంస్థలోని బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాడని తేలింది. ఈ కెమెరాలు నేరుగా అతని మొబైల్ ఫోన్‌కు అనుసంధానించబడి ఉన్నాయి, దీనివల్ల అతను విద్యార్థుల ప్రతి కార్యకలాపాలను పర్యవేక్షించగలిగాడు. బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పదిహేడు మంది విద్యార్థులు, ఈ కెమెరాల నుండి లభించిన ఆధారాలతో ఇది మరింత బలపడింది. ఇక కేసు దాఖలు చేసిన తర్వాత, చైతన్యానంద దాదాపు 55 రోజులు పరారీలో ఉన్నాడని, అతను మధుర, బృందావన్, ఆగ్రాలోని 15 హోటళ్లలో దాక్కోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. సెప్టెంబర్ 27న ఆగ్రాలోని ఒక హోటల్‌లో పోలీసులు అతన్ని అరెస్టు చేయగా.. ఆ హోటల్ రిజిస్టర్‌లో తనను తాను స్వామి పార్థసారథిగా నమోదు చేసుకున్నాడని చెప్పారు.
భారీ నెట్ వర్క్:
ఢిల్లీ పోలీసులు చైతన్యానందను రిమాండ్‌కు తీసుకుని విచారిస్తున్నారు. అతని మూడు మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఎంత మంది అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేశాడో, అతని నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించిందో పోలీసులు వెతుకుతున్నారు. ఇక విచారణలో బాబా తన పాస్‌వర్డ్‌ను మర్చిపోయానంటూ పదే పదే సాకులు చెబుతున్నాడని, ఇప్పటికే అనేక మంది బాధితుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు చెప్పారు. చైతన్యానందపై తీవ్రమైన ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. అతని ఆస్తులను కూడా దర్యాప్తు చేస్తున్నాం. బాధితులు ముందుకు రావచ్చు అని కోరారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!