SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: వెంటాడిన మృత్యువు.. విధుల కోసమని వచ్చి గుండెపోటుతో ఎస్‌ఐ మృతి



విజయవాడలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎస్సై తాను బస చేస్తున్న లాడ్జ్‌లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. లార్జ్‌ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో బందోబస్తు విధుల నిర్వహించేందుకు వచ్చి ఒక ఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన ఎస్సై శ్రీనివాసరావు బందోబస్తు నిమిత్తం విజయవాడకు వచ్చారు. హనుమాన్ పేటలోని ఓ లాడ్జిలో బస చేస్తూ విధులకు హాజరవుతున్నారు. అయితే సోమవారం ఉదయం ఎస్సై శ్రీనివాసరావు బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు

అక్కడ ఎస్‌ఐ శ్రీనివాసరావును పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే గుండెపోటుతో కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Also read

Related posts