Aghori-Sri Varshini: అఘోరీ అలియాస్ శ్రీనివాస్, శ్రీ వర్షిణి టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరికి వివాహం జరిగిందన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మళ్లీ ఇద్దరికి సంబంధించిన ఇంటర్వ్యూలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలు కేసులపై ఇటీవల అరెస్ట్ అయిన అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం పలు మీడియా సంస్థలతో మాట్లాడాడు. జైలు జీవితం, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న అంశాలను పంచుకున్నాడు. మరోవైపు.. శ్రీ వర్షిణికి సంబంధించిన పలు వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. ఓ మీడియా సంస్థతో తాజాగా శ్రీ వర్షిణి మాట్లాడుతూ.. శ్రీనివాస న్ను గట్టిగానే హెచ్చరించింది. తన జోలికి వస్తే బాగుండదని తేల్చి చెప్పింది.
లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కు శ్రీ వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. “నేను శ్రీనివాస్‌కు ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాను.
నన్ను కలవాలి, మళ్లీ కాంటాక్ట్ అవ్వాలి అనే అంశాన్ని మైండ్‌లో నుంచి తీసెయ్.. మీడియా ముందు మాట్లాడి మళ్లీ ఏదో చేయాలి అనుకోకు. నువ్వు కోల్పోయింది పది శాతం అయితే.. నేను మాత్రం నా జీవితాన్నే కోల్పోయాను. ప్రస్తుతం నేను బయట తలెత్తుకొని తిరగలేక పోతున్నాను. అలాంటి పరిస్థితిలోకి నువ్వు నన్ను తీసుకెళ్లావు. నన్ను ఒక ఊబిలోకి పారేశావు. నాకు ఇప్పుడే తెలివి వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఊబిలో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు ఎలాంటోడివి? ఏం చేశావు? ఎలాంటి మాటలు చెప్పావు? తెలుసుకున్నాను కాబట్టి ఆ ఊబిలో నుంచి మెల్లగా బయటకు వస్తున్నాను. అలాగే.. నువ్వు ఇంకోసారి ఏ మీడియాతో అయినా మాట్లాడినా మంచిగా ఉండదు.. నీకు తొందర్లోనే రియాక్షన్ ఇస్తాను. దానికోసం వేయిట్ చేస్తూ ఉండు. ఇంకోసారి నా గురించి బ్యాడ్‌గా మాట్లాడితే బాగుండదు. నీ వల్ల నా ఫ్యామిలీకి నేను చాలా అన్యాయం చేశాను. ఇక నాజోలికి రాకు.. వస్తే బాగుండదు.” అని శ్రీ వర్షిణి ఓ మీడియా సంస్థతో మాట్లాడింది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!