SGSTV NEWS
Andhra PradeshCrime

Road Accident: కాలి నడకన వెళుతున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు..ఇద్దరి మృతి

భవానీ భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ భక్తులు కాలి నడకన నడుకుంటూ వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. బెజవాడ కనక దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో ఇద్దరు భక్తులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో 16వ నంబరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాద ఘటనాస్థలంలోనే భవానీ భక్తులు పకృతి శివ (35), పకృతి శ్రీను (22) మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also read

Related posts