కుంభరాశి వారికి అక్టోబర్ నెల చాలా కష్టకాల సమయం అనే చెప్పాలి. ఈ నెల రెండో వారం నుంచి ఈరాశి వారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా చేయని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి రానున్నది. అందువలన అక్టోబర్ నెలలో కుంభరాశి వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటున్నారు పండితులు.
అక్టోబర్ నెల కొన్ని రాశుల వారికి కలిసొస్తే , మరికొన్ని రాశుల వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి మాత్రం ఈ నెల మిశ్రమ ఫలితాలనిస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, ఈనెలలో కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం.
కుంభ రాశి ఉద్యోగులకు నెల ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీపై సహోద్యోగులు చేసే కుట్రలపై మీ పై అధికారులు యాక్షన్ తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకు మంచి మద్ధతు ఇస్తారు. కానీ రెండో వారం నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి అధికంగా పెరిగే ఛాన్స్ ఉంది.
విద్యార్థులకు కష్టపడితే కాని ఫలితం దక్కదు. పరీక్షల సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. సీనియర్స్, తోటి విద్యార్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మెదలాలి.
కుంభ రాశి వారు కుటుంబ విషయాల్లో ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని సార్లు అదే వ్యతిరేకం కావచ్చును, అందుకు ఈ నెలలో మీరు మాట్లాడే ముందు , ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.
కుంభ రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే? ఈ సమయంలో వీరు ఎక్కువ ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి గురి అవ్వడం వలన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోవాలంట
