కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురు అనాధగా మిగిలిపోతుందని ఆమెకు కూడా విషం ఇచ్చి అనంతరం తాను ప్రాణాలను తీసుకున్నాడు
కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టు్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురు అనాధగా మిగిలిపోతుందని ఆమెకు కూడా విషం ఇచ్చి అనంతరం తాను ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంచాం గ్రామానికి చెందిన సంతోష్ కు, జీరుపాలాం గ్రామానికి చెందిన స్వాతికి 13 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇద్దరు భార్యలతో విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. అయితే స్వాతికి రాంబాబుతో వివాహేతర సంబంధం ఉంది. వృత్తి రీత్యా సంతోష్ డ్రైవర్.. మొదటి భార్యకి పిల్లలు పుట్టక పోవడంతో స్వాతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన రెండేళ్ల నుంచి నిత్యం భార్య స్వాతితో గొడవలు జరుగుతున్నాయి.
దసరా సెలవులు ఇవ్వడంతో
పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తె హైమా(11)కి దసరా సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకుని రావాలని స్వాతిని శనివారం పంపించాడు. అయితే ఆమె పెద్దపాడు వచ్చి రాంబాబుతో తిరిగి ఆ రోజు రాత్రి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లింది. ఉదయం వెళ్లి రాత్రి వరకు ఏం చేశావంటూ సంతోష్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ భార్య, కుమార్తెను జీరుపాలెం కన్నవారింటికి దిగబెట్టాడు. కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తట్టు్కోలేక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే కూతురు హైమా అనాద కావడం ఇష్టం లేక ఆమెకు విషం ఇచ్చి, అనంతరం సంతోష్ కూడా అదే విషాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలోనే సంతోష్ మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్య స్వాతి, ప్రియుడు రాంబాబు పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర విషాదంంలో మునిగిపోయారు సంతోష్ కుటుంబ సభ్యులు.
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..