SGSTV NEWS
CrimeNational

కమ్ టు మై రూమ్.. అంటూ బద్మాష్‌ పనులు.. స్వామి చైతన్యానంద సరస్వతి కోసం పోలీసుల వేట



బాబా ముసుగులో బద్మాష్‌ పనులు చేసిన స్వామి చైతన్యానంద భరతం పట్టేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అమ్మాయిల ఫిర్యాదుతో ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న చైతన్యానంద బాగోతం బట్టబయలైంది..


వయసు 70.. పైగా అతడ్ని గాడ్‌మెన్‌గా స్తుతిస్తూ సేవలు కూడా చేస్తారు. అలాంటి గాడ్‌మెన్‌, ఆడపిల్లల పట్ల ఎంత కరుణగా ఉండాలి. ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్లకు ఎలాంటి భవిష్యత్‌ను అందించాలి. కానీ ఢిల్లీలో ఓబాబా ఉన్నాడు. ఒంటిపైన కాషాయ వస్త్రాలు..ఒంటిలోపల కామలీలలు, అతగాడి వంకర చూపులకు ఎందరో ఆడపిల్లలు నలిగిపోయారు. పైకి చెప్పుకోలేక, లోలోపల మదనపడి ప్రతిరోజూ నరకం చూశారు. అతగాడే స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధి.. ఇప్పుడితగాడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. గురువు ముసుగులో ఆ ముసలి గురువు చేసిన దాష్టీకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వామి చైతన్యానంద ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు..


ప్రస్తుతం చైతన్యానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు ట్రాక్ చేయగా, లొకేషన్ ఆగ్రాసమీపంలో ఉన్నట్లు గుర్తించారు. లైంగిక ఆరోపణలతో శారదా పీఠం ట్రస్ట్ బోర్డ్ ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. చైతన్యానందతో సంబంధాలను తెంచుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. శారదాపీఠం ఆధ్వర్యంలోనే విద్యా సంస్థ నడుస్తోంది. అలాగే విద్యాసంస్థ బేస్‌మెంట్‌లో ఒక కారును కూడా గుర్తించారు. దానికి ఉన్న నంబర్ ప్లేట్ నకిలీదని తేలింది. ఆధ్యాత్మిక ముసుగులో ఈ దొంగ గురువు లీలలను 17మంది బాలికలు ధైర్యం చేసి బయటపెట్టారు. అతడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బాధిత విద్యార్ధినులు..

బాబా ముసుగులో బద్మాష్‌ పనులు చేసిన స్వామి చైతన్యానంద భరతం పట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

కమ్ టు మై రూమ్..
కమ్ టు మై రూమ్.. అంటూ మెస్సేజ్ చేస్తాడట.. తన రూమ్‌కు ఒంటరిగా రావాలని పిలుస్తాడట.. కానీ స్టూడెంట్స్ గురువు మెస్సేజ్‌కు రిప్లై ఇచ్చేవారు కాదని పోలీసులు తెలిపారు. రిప్లై రాకపోయినా..ఇంకా రెచ్చిపోయి బాలికలను లొంగదీసుకునేందుకు పలు రకాల ఆఫర్స్‌తో వాట్సప్ చాట్‌ చేసేవాడు. ఫారిన్ ట్రిప్‌లంటూ విద్యార్ధినులను లోబరుచుకునేందుకు ట్రై చేసేవాడు. అబ్రాడ్‌కు తానే తీసుకెళ్తానని, రూపాయి ఖర్చులేకుండా ట్రిప్‌ను ఎంజాయ్ చేయవచ్చని ఆశపెడతాడు..అప్పటికీ స్టూడెంట్స్ నుంచి రిప్లై రాకపోతే, చివరాఖర్న బ్లాక్‌మెయిల్‌కు దిగుతాడు. తనకు లొంగకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించేవాడని.. ఇలా ఒకర్ని కాదు..ఇద్దర్ని కాదు..మొత్తం ఆశ్రమంలోని బాలికలందర్నీ వేధించినట్లు సమాచారం..

గత 12 ఏళ్లుగా.. అతడిదే రాజ్యం
12 ఏళ్లుగా టోటల్‌ ఆశ్రమం మొత్తం అతడి చేతుల్లోనే ఉంది. అధ్యాపకుల నుంచి వార్డెన్స్ వరకు అతడి చెప్పుచేతుల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆబాలికల పరిస్థితి ఊహించండి. ఏళ్లుగా నరకం చూశారు. ఇక రాను రాను అతడి చేష్టలు హద్దులుమీరడంతో , భరించలేక 17మంది బాలికలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఈదొంగబాబాపై అనేక అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. బలహీనవర్గాలకు చెందిన వారిని టార్గెట్ చేసి ఆశ్రమంలో చేర్చుకుంటాడు. అలా చేరిన వారంతా స్కాలర్‌షిప్‌ మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్ధులేనని పోలీసులు తెలిపారు. అధ్యాపకుల నుంచి వార్డెన్స్ వరకు బాబా చెప్పినట్లే వినాలంటూ స్టూడెంట్స్‌పై ఒత్తిడి తెచ్చేవారని.. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే చైతన్యానంద దగ్గరకు తీసుకెళ్లేవారని విద్యార్ధినులు తమ ఫిర్యాదులో తెలిపారు.. అయితే.. వార్డెన్స్ ద్వారా విద్యార్ధుల సమాచారం మొత్తం దొంగబాబాకు వెళ్లేది. ఆరోజు ఏ స్టూడెంట్‌నైతే టార్గెట్ చేస్తాడో ఆ అమ్మాయికి వాట్సప్ మెస్సేజ్‌ల ద్వారా సంకేతాలు పంపేవాడని పోలీసులు తెలిపారు.

కాగా..2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్‌ కుంజ్ ప్రాంతంలో ఒక మహిళ కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. నకిలీ UN నంబర్ ప్లేట్ కారు వాడినట్లు విచారణలో తేలింది. కాగా.. స్వామి చైతన్యానంద సరస్వతిపై ఇప్పటివకే 5 FIRలు నమోదు చేశారు. పోలీసుల FIRలో ముగ్గురు మహిళా ఉద్యోగుల పేర్లు నమోదు చేశారు.. చైతన్యానందపై విద్యార్థినులు ఫిర్యాదు చేసినా.. ఒక మహిళా ఉద్యోగి పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.. 32 మంది విద్యార్థినుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు.. చర్యలకు సిద్ధమయ్యారు.

Also read

Related posts