ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు అమ్మాయి తల్లిదండ్రులు. యువకుడి ఇంటిపై దాడి చేసి మరీ యువతి బంధువులు ఆమెను లాక్కెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు అమ్మాయి తల్లిదండ్రులు. యువకుడి ఇంటిపై దాడి చేసి మరీ యువతి బంధువులు ఆమెను లాక్కెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రవీణ్, శ్వేత ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే శ్వేత ఇంట్లో వాళ్లు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు
మరో పెళ్లి చేయాలని
దీంతో తమ కూతుర్ని ఎలాగైనా ప్రవీణ్ ఇంటి నుంచి తీసుకువచ్చి మరో పెళ్లి చేయాలని శ్వేత తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకు బంధువుల సహాయం కూడా తీసుకున్నారు. అబ్బాయి కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం కొట్టి శ్వేతను ఈడ్చుకెళ్లారు. బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లి పోయారు. కిడ్నాప్ సమయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also read
- Big breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు
- Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..