SGSTV NEWS
Andhra PradeshCrime

Crime : ఎంతపనిచేశావమ్మా .. నోటికి ప్లాస్టర్‌.. ముక్కుకు క్లిప్పు పెట్టుకుని ప్రాణం తీసుకున్న విద్యార్థిని


ఒంటరితనం ఆ విద్యార్థినిని కుంగదీసింది. అందరూ ఉన్న ఏకాకిగానే ఫీలయింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. అందులోనూ నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్‌ క్లిప్పు పెట్టుకుని తనకు తాను ఊపిరాడకుండా చేసుకుని ప్రాణాలు తీసుకుంది



ఒంటరితనం ఆ విద్యార్థినిని కుంగదీసింది. అందరూ ఉన్న ఏకాకి(Lonely) గానే ఫీలయింది. దీంతో ఆత్మహత్య(Student Suicide News) కు పాల్పడింది. అందులోనూ నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్‌ క్లిప్పు పెట్టుకుని తనకు తాను ఊపిరాడకుండా చేసుకుని ప్రాణాలు తీసుకుంది. రాత్రంతా స్నేహితులందరితో సరదాగా గడిపిన  ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం గుంటురులో కలకలం రేపింది. 

Student Commits Suicide
పోలీసుల తెలిపిన వివరాల  ప్రకారం.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కమ్మ శ్రావ్య (20)  గుంటూరు అశోక్‌నగర్‌లోని నవీన లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ వీవీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది(engineering student). అయితే శ్రావ్య తల్లిదండ్రులకు దూరం ఉండటం మూలంగా ఒంటరితనంగా భావిస్తుండేది. ఈ క్రమంలో  ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలు జాగృతికి ఫోన్‌ చేసిన శ్రావ్య చాలా సేపు మాట్లాడింది. ఈ సందర్భంగా తన  ఒంటితనాన్ని గుర్తు చేసుకుంటూ తనకు బతకాలని లేదని.. ఆత్మహత్య చేసుకుని చనిపోతానని వాపోయింది. దానికి సమాధానంగా స్నేహితురాలు బాగానే చదువుతున్నావు కదా.. ఇంకా సమస్యలేమైనా ఉంటే చెప్పు నా నుంచి వీలయ్యే సాయం చేస్తానని జాగృతి ధైర్యం చెప్పింది.  అనంతరం ఈ విషయాన్ని ఆమె.. శ్రావ్య సోదరుడికి కాల్‌ చేసి చెప్పింది. ఆయన వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే తల్లిదండ్రులు శ్రావ్యకు ఫోన్‌ చేసి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పడంతో పాటు.. మేము వచ్చి తీసుకెళ్తామని, ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని నచ్చజెప్పారు. అయితే మీరు రావద్దని సెలవులిస్తే.. తానే ఇంటికి వస్తానని శ్రావ్య అనడంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో పాటు  సహచర విద్యార్థిని హిమసిరితో మాట్లాడి శ్రావ్యను జాగ్రత్తగా చూడాలని తల్లిదండ్రులు కోరారు.

దీంతో హిమసిరి ఆదివారం అర్ధరాత్రి వరకు శ్రావ్యతో కబుర్లు చెప్పుకుంటూ గడిపింది. అనంతరం పడుకుందామని హిమసిరి కోరగా నేను తర్వాత నిద్రపోతానని శ్రావ్య బదులిచ్చింది. దీంతో హిమసిరి నిద్రపోయింది. కాగా హాస్టల్‌లో అందరూ నిద్రపోయాక శ్రావ్య12.30 గంటల ప్రాంతంలో  నోటికి ప్లాస్టర్‌ వేసుకుని, ముక్కుకు క్లిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం తోటి విద్యార్థినులు  లేపి చూడగా శ్రావ్య అచేతనంగా పడి ఉంది. ఈ విషయాన్ని గమనించి వారు వార్డెన్‌కు చెప్పారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ తరంగిణి సంఘటనా స్థలానికి చేరుకుని శ్రావ్య మృతదేహాన్ని పరిశీలించారు. శ్రావ్య తల్లి ఉమా రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరితనమే ఆమెను కుంగదీసి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read

Related posts